Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కంటిచూపుతో ధోనీ వెంటాడేవాడు.. కోహ్లీ కూడా నమ్ముతున్నాడు.. అందుకే ఇలా వికెట్లు తీస్తున్నా: కేదార్ జాదూ

బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీస్‌తో తన స్ఫూర్తిదాయకమైన బౌలింగ్‌కు టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనినే కారణమని భారత ప్లేయర్‌ కేదార్‌ జాదవ్‌ తెలిపాడు. ’గతంలో ధోని సారథ్యంలో నా బౌలింగ్‌ లో మెరుగుదలకు బీజం పడిం

Advertiesment
Dhoni
హైదరాబాద్ , శనివారం, 17 జూన్ 2017 (04:40 IST)
బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీస్‌తో తన స్ఫూర్తిదాయకమైన బౌలింగ్‌కు టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనినే కారణమని భారత ప్లేయర్‌ కేదార్‌ జాదవ్‌ తెలిపాడు. ’గతంలో ధోని సారథ్యంలో నా బౌలింగ్‌ లో మెరుగుదలకు బీజం పడింది. భారత జట్టులోకి వచ్చిన్నప్పట్నుంచీ ఎక్కువ సమయం ధోనితోనే గడిపా. అతని నుంచి అనేక విషయాలు నేర్చుకునే వాణ్ని. ఆ క్రమంలోనే నా నుంచి ధోని ఏమి కోరుకుంటున్నాడో నాకు అర్థమయ్యేది. అతని కళ్ల ద్వారా నా నుంచి ఏమి ఆశిస్తున్నాడు తెలుసుకునే వాణ్ని. అదే రకంగా బౌలింగ్‌ చేయడానికి ప్రయత్నించి సక్సెస్‌ అయ్యాను. ఇప్పుడు విరాట్‌ కోహ్లి కూడా నాపై నమ్మకంతో బంతిని చేతికిస్తున్నాడు.  బంగ్లాతో మ్యాచ్‌ లో నన్ను ఒక గేమ్‌ ఛేంజర్‌గా మార్చిన ఘనత కోహ్లిది. అయితే నా బౌలింగ్‌ మెరుగుపడటానికి మాత్రం కచ్చితంగా ధోనినే కారణం’ అని కేదర్‌ జాదవ్‌ తెలిపాడు.

కాగా, మ్యాచ్‌ను మలుపుతిప్పిన జాదవ్‌ పై కోహ్లి ప్రశంలస వర్షం కురిపించాడు. నెట్స్‌ లో కేదర్‌ పెద్దగా బౌలింగ్‌ చేయకపోయినా, అతనొక స్మార్ట్‌ క్రికెటర్‌ అంటూ కితాబిచ్చాడు. అసలు బంగ్లాతో మ్యాచ్‌ లో జాదవ్‌ బౌలింగ్‌ ను దింపడానికి ధోనినే కారణమని కోహ్లి పేర్కొన్నాడు.

’ఇక్కడ మొత్తం క్రెడిట్‌ ను కేదర్‌ కు ఇవ్వడం లేదు. కేదర్‌కు బౌలింగ్‌ కు ఇచ్చే ముందు ధోనిని సంప్రదించా. మేమిద్దరం ఒక నిర్ణయం తీసుకున్న తరువాత జాదవ్‌కు బంతిని అప్పజెప్పా. ఆ సమయంలో జాదవ్‌ బౌలింగ్‌ మాకు మంచి ఆప్షన్‌గా అనిపించింది. నిజంగా అతను చాలా బాగా బౌలింగ్‌ చేసి మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చాడు ’అని కోహ్లి ప్రశంసించాడు.
 
కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ కొంప ముంచేలా బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ తమీమ్, ముష్పికర్లు భారత బౌలర్ల భరతం పడుతుండగా ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు పార్ట్ టైమ్ బౌలర్ కేదార్ జాదవ్. వికెట్ కీపర్ ధోనీ సలహాతో కెప్టెన్ విరాట్ కోహ్లీ బంతి జాదవ్ చేతికి ఇచ్చాడు. ఆ క్షణమే బంగ్లాదేశ్ ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. 3 ఓవర్లలో హార్దిక్ పాండ్యా నుంచి 28 పరుగులు పిండుకోగలిగిన బంగ్లా బ్యాట్స్‌మెన్ ఉరుములు, మెరుపులు లేకుండా బౌలింగ్‌కు వచ్చిన కేదార్ జాదవ్‌ చేతికి చిక్కేశారు. 
 
కే్వలం 6 ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చి బంగ్లా జట్టు రన్ రేట్‌ను దారుణంగా దెబ్బతీసిన కేదార్ కీలకమైన ఆ ఇద్దరు బ్యాట్స్‌మెన్లను ఔట్ చేశాడు. కేదార్ బౌలింగులో క్యాచ్‌ను ఒడిసిపట్టిన కోహ్లీ జాదవ్ కేసి చూసిన చూపు, వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి హత్తుకున్న తీరు చూస్తే జాదవ్ తన కేప్టెన్‌ని ఎంత ఇంప్రెస్ చేశాడు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాక్ బలం, బలహీనత మాకు తెలుసు.. విజేతలుగానే ఫైనల్‌కు సిద్ధపడతామన్న కోహ్లీ