Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిజాయితీగా పనిచేసే వ్యక్తులు నచ్చరు.. రవిశాస్త్రి లాంటి అవినీతిపరుడే మహా ఇష్టం.. కోహ్లీపై ధ్వజమెత్తిన కేఆర్‌కే

కెప్టెన్ విరాట్ కోహ్లీతో విభేదాల కారణంగానే నిజాయతీ పరుడైన కుంబ్లే తన బాధ్యతల నుంచి స్వయంగా తప్పుకున్నాడని మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కుంబ్లే రాజీనామా వివాదంలో కోహ్లీపై బాలీవుడ్ నటుడు, విమర్శకుడు కమల్ రషీద్ ఖాన్ (కేఆర్కే ) వ

నిజాయితీగా పనిచేసే వ్యక్తులు నచ్చరు.. రవిశాస్త్రి లాంటి అవినీతిపరుడే మహా ఇష్టం.. కోహ్లీపై ధ్వజమెత్తిన కేఆర్‌కే
హైదరాబాద్ , శుక్రవారం, 23 జూన్ 2017 (06:42 IST)
కెప్టెన్ విరాట్ కోహ్లీతో విభేదాల కారణంగానే నిజాయతీ పరుడైన కుంబ్లే తన బాధ్యతల నుంచి స్వయంగా తప్పుకున్నాడని మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కుంబ్లే రాజీనామా వివాదంలో కోహ్లీపై బాలీవుడ్ నటుడు, విమర్శకుడు కమల్ రషీద్ ఖాన్ (కేఆర్కే ) విరుచుకుపడ్డాడు. నిజాయతీగా పనిచేసే వ్యక్తులు కోహ్లీకి నచ్చరంటూ ట్వీట్ చేశాడు కేఆర్కే.
 
'కుంబ్లే నిజాయతీపరుడు. విరాట్ మాత్రం రవిశాస్త్రి లాంటి వ్యక్తినే కోచ్‌గా ఇష్టపడతాడు. రవిశాస్త్రి కూడా కోహ్లీ లాగే అవినీతి పరుడు కావడమే ఇందుకు కారణమని' కేఆర్కే తన ట్వీట్లో రాసుకొచ్చాడు. ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో భారత్ కచ్చితంగా కప్పు నెగ్గదని కేఆర్కే జోస్యం చెప్పగా అదే నిజమైన సంగతి తెలిసిందే. కోహ్లీ ప్రవర్తన వల్లే జట్టు ఓటమిని మూటకట్టుకుంటుందని కెప్టెన్ పై నిప్పులు చెరిగాడు. ప్రస్తుతం కోచ్ వివాదంలోనూ కుంబ్లేకు ఎసరు పెట్టడానికి కారణంపై స్పందించాడు. కోహ్లీకి తనలాగే అవినీతికి పాల్పడే వ్యక్తే కోచ్‌గా ఉండేందుకు ఇష్టపడతాడని భారత కెప్టెన్ పై విమర్శలు గుప్పించాడు.
 
 KRK ✔ @kamaalrkhan
Kumble is honest man so of course Virat will love to have Ravi Shashtari as coach coz he is big corrupt like Kohli. 
 
ఇదిలా ఉండగా... టీమిండియా ప్రధాన కోచ్‌గా అనిల్ కుంబ్లే రాజీనామా అనంతరం బీసీసీఐ కొత్త కోచ్‌ కోసం వేట మొదలు పెట్టింది. ఒక దిగ్గజ ఆటగాడు, సీనియర్ కోచ్ ఉన్నఫళాన పదవినుంచి వైదొలిగితే కూడా చీమకుట్టినట్లు అనిపించని బీసీసీఐ నింపాదిగా కొత్త కోచ్ కోసం ప్రయత్నాలు మొదలెట్టడం దారుణం అంటూ నెటిజన్లు అటు కోహ్లీని, ఇటు బీసీసీఐని తూర్పారబడుతున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అప్పుడు కుంబ్లే సర్‌కు శుభాకాంక్షలు.. ఇప్పుడు సర్‌ పనికిరాడట. ట్వీటూ డిలెట్ చేశాడు.. వెన్నుపోటులో కోహ్లీ రకం