అప్పుడు కుంబ్లే సర్‌కు శుభాకాంక్షలు.. ఇప్పుడు సర్ పనికిరాడట. ట్వీటూ డిలెట్ చేశాడు.. వెన్నుపోటులో కోహ్లీ రకం
వెన్నుపోటులో కొత్తరకం కాదు.. కోహ్లీ రకం అనేది కొత్తగా వచ్చి చేరినట్లుంది. ఒక సంవత్సరం ముందు టీమిండియా కోచ్‌గా ఎంపికైన అనిల్ కుంబ్లేకి శుభాకాంక్షలు చెప్పటమే కాకుండా సర్ అని గౌరవించి నక్క వినయం చాటుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు ఆ సర్
వెన్నుపోటులో కొత్తరకం కాదు.. కోహ్లీ రకం అనేది కొత్తగా వచ్చి చేరినట్లుంది. ఒక సంవత్సరం ముందు టీమిండియా కోచ్‌గా ఎంపికైన అనిల్ కుంబ్లేకి శుభాకాంక్షలు చెప్పటమే కాకుండా సర్ అని గౌరవించి నక్క వినయం చాటుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు ఆ సర్‌ను భాయ్ అని గ్రేడ్ తగ్గించి పలకడమే కాదు.. నువ్వు ఉండాలని టీమ్‌లో ఎవరూ కోరుకోలేదని కుంబ్లే ముుందే వ్యాఖ్యానించి ఘోరంగా కోచ్ పదవి నుంచి సాగనంపాడు. ఇంకా విచిత్రం ఏమంటే 'కోచ్‌గా ఎంపికైనందుకు కుంబ్లే సార్‌కు శుభాకాంక్షలు, మీసారధ్యంలో జట్టు ముందుకు సాగుతుంది' అని అదే రోజు చేసిన ట్వీట్‌ని కూడా కోహ్లీ తొలగించేశాడు. అందుకే ఇది వెన్నుపోట్లలో కోహ్లీ రకం అని చెప్పడం.
భారత్ క్రికెట్‌టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ మద్య విభేదాలు ఎంత తీవ్రస్థాయికి చేరాయో ఈ సంఘటన అద్దం పడుతోంది. గతంలో కోచ్‌గా అనిల్ కుంబ్లేని నియమాన్ని ఆహ్వానిస్తూ విరాట్ ట్విట్టర్‌లో ట్వీట్‌చేశాడు. అయితే ఇప్పుడు ఆట్వీట్లను కోహ్లీ తన ట్విట్టర్ అకౌంట్ నుంచి డిలీట్ చేశాడు. ఇప్పుడు ఆ ట్వీట్లు ట్టిట్టర్‌లో కనిపించడంలేదు. 2016 జూన్ 23న భారత్ క్రికెట్ చీఫ్ కోచ్‌గా అనిల్ కుంబ్లే ఎంపికయ్యాడు. ఆసమయంలో విరాట్ కుంబ్లేకు శుభాకాంక్షలు తెలుపుతూ 'కోచ్‌గా ఎంపికైనందుకు కుంబ్లే సార్‌కు శుభాకాంక్షలు, మీసారధ్యంలో జట్టు ముందుకు సాగుతుంది' అని అదే రోజు ట్వీట్ చేశాడు.
పదవినుంచి దిగిపోయిన కొద్ది గంటల తర్వాత కుంబ్లే కోహ్లీ కారణంగానే కోచ్‌పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 'నేను ఎప్పుడు కెప్టెన్, కోచ్ పాత్రలను గౌరవిస్తాను. కోచ్, కెప్టెన్‌ల మధ్య ఉన్న అపార్థాలను తొలగించడానికి బీసీపీఐ చాలా ప్రయత్నించింది. కానీ అది సఫలం కాలేదు. కోచ్, కెప్టెన్ మధ్య అవగాహన ముఖ్యం. అది మా మధ్యలోపించింది అందుకే పదవి నుంచి వైదొలగడం మంచిదని భావించాను' అంటూ కుంబ్లే తెలిపాడు.
చాంపియన్‌ట్రోఫీ అనంతరం వెస్టిండీస్ పర్యటనకు కోచ్‌గా కుంబ్లే కొనసాగుతాడని బీసీసీఐ ప్రకటించింది. అయతే ఆకస్మికంగా కోచ్ పదవి బాద్యతలనుంచి వైదలగుతున్నానంటూ కుంబ్లే ప్రకటించిన విషయం తెలిసిందే. బీసీసీఐతో కుంబ్లే కుదుర్చుకున్న ఒప్పందం చాంపియన్స్ ట్రోఫీతో ముగిసిపోయింది. తిరిగి రెండోసారి కూడా ఆయననే కొనసాగించే అవకాశాలు ఉన్నాయని అందరూ భావించారు. అయితే కోహ్లీ, కుంబ్లే మధ్య విభేదాలు రాజుకోవడంతో కుంబ్లే అనూహ్యంగా కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. కుంబ్లే నిర్ణయంతో కోహ్లీతో ఉన్న మనస్పర్థలు బయటపడ్డాయి.