Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్: భారత్ కొంప ముంచిన నోబాల్స్.. భువి మినహా బౌలర్లు మొత్తంగా విఫలం

ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ డెత్ బౌలర్, యార్కర్ల రారాజుగా పేరొందిన బూమ్రా కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో ఇంతగా కొంప ముంచుతాడని ఎవరనుకున్నారు? టీమిండియా కీలక స్పిన్నర్లు ఓవర్‌కు ఏడుపరుగుల చొప్పున పరుగులు సమర్పిస్తారమని ఎవరు కలగన్నారు? మహాభారతంలో కర్ణుడి చ

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్: భారత్ కొంప ముంచిన నోబాల్స్.. భువి మినహా బౌలర్లు మొత్తంగా విఫలం
హైదరాబాద్ , ఆదివారం, 18 జూన్ 2017 (20:19 IST)
ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ డెత్ బౌలర్, యార్కర్ల రారాజుగా పేరొందిన బూమ్రా కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో ఇంతగా కొంప ముంచుతాడని ఎవరనుకున్నారు? టీమిండియా కీలక స్పిన్నర్లు ఓవర్‌కు ఏడుపరుగుల చొప్పున పరుగులు సమర్పిస్తారమని ఎవరు కలగన్నారు? మహాభారతంలో కర్ణుడి చావుకు ఆరుగురు కారణమంటారు కానీ ఈరోజు టీమిండియా వైఫల్యానికి బౌలర్లు మొత్తంగా కారకులంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ప్రతి సెషన్‌లోనూ బౌలర్లు చేసిన తప్పిదాలు కీలకమ్యాచ్‌లో భారత్‌ను దెబ్బతీశాయి.
 
భారత్ బౌలర్ల నిర్లక్ష్యపు బౌలింగ్ వల్ల మూల్యం చెల్లించుకున్న సందర్భాలు అనేకం. ప్రధానంగా నో బాల్స్ వల్ల భారత్ అనేక కీలక మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. తాజాగా చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌తో జరుగుతున్న తుది పోరులో సైతం భారత్ జట్టు నిర్లక్ష్యపు బౌలింగ్ వల్ల భారీ మూల్యం చెల్లించుకుంది. భారత ప్రధాన పేసర్ బూమ్రా వేసిన నాల్గో ఓవర్ తొలి బంతి పాకిస్తాన్ ఓపెనర్ ఫకార్ జమాన్ బ్యాట్ ను తాకి వికెట్ కీపర్ ధోని చేతుల్లో పడింది. 
 
అయితే అది నో బాల్ కావడంతో జమాన్ బతికిపోయాడు. అప్పుడు ఫకార్ జమాన్ వ్యక్తిగత స్కోరు 3. కాగా, ఆపై రెచ్చిపోయిన జమాన్ ఏకంగా సెంచరీ సాధించి పాక్ భారీ స్కోరుకు బాటలు వేశాడు. 2016లో జరిగిన ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20 గుర్తుంది కదా. వెస్టిండీస్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అప్పుడు బూమ్రా వేసిన నో బాల్ వల్లే విండీస్ సునాయాసంగా గెలిచి ఫైనల్‌కు చేరింది. లెండిల్ సిమన్స్ ను మొదట్లోనే బూమ్రా అవుట్ చేసినప్పటికీ, అది నో బాల్ కావడంతో అతను బతికిపోయాడు. ఆపై మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడాడు. 51 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 82 పరుగులతో అజేయంగా నిలిచి విండీస్ ను ఫైనల్ కు చేర్చాడు.
 
ఇప్పుడు పాకిస్తాన్ మ్యాచ్ లో జమాన్ శతకంతో మెరవడం ఆ ఘటనను గుర్తుకు తెస్తుంది. ఈ రోజు మ్యాచ్‌లో బూమ్రా వేసిన నో బాల్‌తో లైఫ్ వచ్చిన ఫకార్ దాన్ని చక్కగా  సద్వినియోగం చేసుకుని సెంచరీ సాధించాడు. 92 బంతుల్లో శతకం చేసి పాకిస్తాన్‌ను పటిష్ట స్థితికి చేర్చాడు. ఒకవేళ మ్యాచ్‌లో ఫలితం పాకిసాన్‌కు అనుకూలంగా ఉంటే మాత్రం అందుకు బూమ్రా నో బాలే కారణం అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారీ లక్ష్య ఛేదనలో భారత్‌కు పిడుగుపాటు.. 33 పరుగులకే రోహిత్, కోహ్లీ. ధావన్ ఔట్