Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాకిస్తాన్ వీక్‌నెస్ ఏంటో మాకు తెలుసు... విరాట్ కోహ్లి(వీడియో)

నరాలు తెగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోటీ రేపే(18-06-2017). ఈ నేపధ్యంలో భారత్-పాకిస్తాన్ జట్లు తమ ఆటతీరు ఎలా వుండాలన్నదానిపై వ్యూహం రచించుకోవడం మామూలే. రేపు ఎలా ఆడబోతున్నారు రాజా... అని కోహ్లిని అ

పాకిస్తాన్ వీక్‌నెస్ ఏంటో మాకు తెలుసు... విరాట్ కోహ్లి(వీడియో)
, శనివారం, 17 జూన్ 2017 (18:28 IST)
నరాలు తెగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోటీ రేపే(18-06-2017). ఈ నేపధ్యంలో భారత్-పాకిస్తాన్ జట్లు తమ ఆటతీరు ఎలా వుండాలన్నదానిపై వ్యూహం రచించుకోవడం మామూలే. రేపు ఎలా ఆడబోతున్నారు రాజా... అని కోహ్లిని అడిగితే టీమ్ ఇండియా కెప్టెన్ ఇలా చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో తలపడటానికి తమ వ్యూహాల్లో కొత్త మార్పులు ఏవీ అవసరం లేదన్నాడు. పాక్ బలం, బలహీనతలు తమకు స్పష్టంగా తెలుసు కాబట్టి ఆ ప్రాతిపదికనే తాము పథక రచన చేపడతామని, జట్టులో భారీ మార్పులు చేయవలసిన అవసరం లేదని తేల్చేశాడు.
 
భారత్, పాక్‌ హై ఓల్టేజి ఫైనల్‌ మ్యాచ్‌ గురించి మాత్రం కోహ్లి చాలా తేలిగ్గానే స్పందించాడు. ‘ఇప్పటిదాకా మేం కొనసాగించిన ఆటనే ఫైనల్లోనూ ప్రదర్శిస్తాం. పాక్‌ బలం, బలహీనతల గురించి మాకు తెలుసు. దానికి తగ్గట్టుగా మా ప్రణాళికలు ఉంటాయి. కానీ మ్యాచ్‌లో భారీ మార్పులు చేసుకోవాల్సిన అవసరం మాత్రం లేదు. సమష్టిగా మా ఆటతీరు అద్భుతంగా ఉంది. ఫైనల్‌ రోజు మా స్థాయికి తగ్గ ఆటను మైదానంలో కనబరిస్తే ఫలితం అదే వస్తుంది. ముందుగానే ఎవరినీ విజేతలుగా అంచనా వేయలేం. ఇప్పటిదాకా కొన్ని ఆశ్చర్యకర ఫలితాలను చూశాం’ అని కోహ్లి తెలిపాడు. 
 
మరోవైపు చాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్తాన్‌ ప్రదర్శన ఆకట్టుకుందని కొనియాడాడు. ఓ జట్టు మంచి క్రికెట్‌ ఆడితేనే ఫైనల్‌కు వస్తుందని, పరిస్థితులను వారికి అనుకూలంగా మలుచుకుని అద్భుత ఫలితాలను సాధించారని కొనియాడాడు. సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను సునాయాసంగా ఓడించి భారత్‌, మరో సెమీస్‌లో ఊపుమీదున్న ఇంగ్లండ్‌ను మట్టికరిపించి పాక్‌ జట్లు ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. చూడండి వీడియో....

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఛాంపియన్స్ లీగ్ ఫైనల్: భారత్‌కే ట్రోఫీ.. పాక్ కెప్టెన్ మేనమామ జోస్యం.. యూపీలో ముస్లింల పూజలు..