Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఛాంపియన్స్ లీగ్ ఫైనల్: భారత్‌కే ట్రోఫీ.. పాక్ కెప్టెన్ మేనమామ జోస్యం.. యూపీలో ముస్లింల పూజలు..

భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరు జరగనుంది. దాయాది దేశాల మధ్య జరిగే ఉత్కంఠభరితమైన మ్యాచ్ కోసం యావత్తు క్రికెట్ ప్రపంచం ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలాంటి అంచనాలు లే

ఛాంపియన్స్ లీగ్ ఫైనల్: భారత్‌కే ట్రోఫీ.. పాక్ కెప్టెన్ మేనమామ జోస్యం.. యూపీలో ముస్లింల పూజలు..
, శనివారం, 17 జూన్ 2017 (18:14 IST)
భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరు జరగనుంది. దాయాది దేశాల మధ్య జరిగే ఉత్కంఠభరితమైన మ్యాచ్ కోసం యావత్తు క్రికెట్ ప్రపంచం ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఎలాంటి అంచనాలు లేకుండా పాకిస్థాన్ బరిలోకి దిగినప్పటికీ.. సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ను సొంత గడ్డపై ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టింది. దీంతో ఫైనల్ పోరులో భారత్‌తో అమీతుమీకి రెడీ అయ్యింది. ముంబై పేలుళ్ల అనంతరం అంతర్జాతీయ వేదికపై ఆడుతున్న దాయాది దేశాల పోరును వీక్షించేందుకు ఇప్పటికే క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రీడాకారులు సైతం సై అంటే సై అంటున్నారు. 
 
ఛాంపియన్స్ ట్రోఫీలో మంచి రికార్డు కలిగివున్న పాకిస్థాన్‌ను తక్కువగా అంచనా వేయలేం. అలాగే డిఫెండింగ్ ఛాంపియన్‌గా మారిన కోహ్లీ సేన తేలిగ్గా తీసిపారేయలేం. తద్వారా భారత్-పాక్‌ల మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ పోరులో భారత్ గెలవాలని యూపీలోని వార‌ణాసిలో ముస్లింలు ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేశారు. ఇందులో ముస్లిం మ‌త పెద్ద‌లు, యువ‌కులు, మ‌హిళ‌లు అంతా క‌లిసి పాల్గొన్నారు. రంజాన్ మాసం కావ‌డంతో ప్ర‌స్తుతం ముస్లింలు ఉప‌వాస దీక్ష‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఫైనల్‌లో భారత దేశమే గెలవాలని వారు ప్రార్థించారు.
 
మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ సర్ఫరాజ్ మేనమామ మెహబూబ్ హసన్ ఇండో-పాక్ ఛాంపియన్స్ లీగ్ ఫైనల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో టీమిండియా విజయం సాధిస్తుందని.. పాక్‌కు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. సర్ఫరాజ్ తల్లి ఆక్విలా బనోకి మెహబూబ్ హాసన్ స్వయానా సోదరుడు. మెహబూబ్ హసన్ భారత్‌లోని యూపీలో ఉంటున్నారు.
 
ఇత్వా వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాలలో క్లర్క్ గా పని చేస్తున్నారు. ఆయన వయసు 52 ఏళ్లు. షకీల్ అహ్మద్ తో వివాహం జరిగిన అనంతరం సర్ఫరాజ్ తల్లి కరాచీకి వెళ్లిపోయింది. నాలుగేళ్ల వయసులో సర్ఫరాజ్ తొలిసారి తన మేనమామను చూశాడు. 2015లో కరాచీలో జరిగిన సర్ఫరాజ్ పెళ్లికి హసన్ వెళ్లారు. సర్ఫరాజ్ జట్టు తరపున అతను ఆడుతున్నాడని.. అయితే తన మద్దతు భారత్‌కేనని చెప్పాడు. ట్రోఫీ భారత్‌దేనని.. భారత్‌తో పాకిస్థాన్‌ను పోల్చలేమని హసన్ వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ పోరు: భారత్-పాక్‌ మ్యాచ్‌కు జోరందుకున్న పందేలు.. రూ.2వేల కోట్ల వరకు?