పిల్లాట ఆడిన సఫారీలు.. అవుట్ కోసం పోటీ పడి మరీ ప్రేక్షకులను నవ్వించారు
భారత పీల్డింగ్ వ్యూహానికి ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సఫారీలు ఎలా బుట్టలో పడ్డారో, ఎంత భయభ్రాంతులకు గురయ్యారో డేవిడ్ మిల్లర్, డుప్లెసిస్ మధ్య చోటు చేసుకున్న తడబాటే తెలిపింది. ఒక అంతర్జాతీయ గేమ్‌లో ఇద్దరు కీలక బ్యాట్స్‌మెన్లు తమ వికెట్ కాపాడుకోవడానికి ఒక
భారత పీల్డింగ్ వ్యూహానికి ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సఫారీలు ఎలా బుట్టలో పడ్డారో, ఎంత భయభ్రాంతులకు గురయ్యారో డేవిడ్ మిల్లర్, డుప్లెసిస్ మధ్య చోటు చేసుకున్న తడబాటే తెలిపింది. ఒక అంతర్జాతీయ గేమ్‌లో ఇద్దరు కీలక బ్యాట్స్‌మెన్లు తమ వికెట్ కాపాడుకోవడానికి ఒకే ఎండ్‌కు పరుగెత్తిన వైన కడుపుబ్బ నవ్వించడమే కాదు.. భారత్ ఫీల్డింగ్ ఈ మ్యాచ్‌లో ఎంత అత్యున్నత ప్రమణాలకు చేరిందో వీరిద్దరి తడబాటు ససాక్ష్యంగా నిలిపింది.
మొన్న పాకిస్తాన్, నేడు భారత్ చేతిలో ఒకే తీరున ఘోరంగా ఓడిపోయిన సఫారీ జట్టు ఒత్తిడిలో ఆటను చేజేతులా కోల్పోయే తన అలవాటు బలాన్ని మరోసారి నిరూపించుకుంది. ధోనీ అద్భుత రనౌట్లు, క్యాచ్‌లు, కోహ్లీకి అందించిన సహాయం మొత్తం ఆట తీరునే మార్చివేసింది. ఇక పోతే భువనేశ్వర్, బూమ్రా బౌలింగ్ గురించి చెప్పపనిలేదు. భారత గేమ్ ప్లాన్‌ను ఈ ఇద్దరితోపాటు అశ్విన్ కూడా అమలు పర్చిన తీరు అమోఘం అనే చెప్పాలి.
చాంపియన్స్ ట్రోఫీలో భారత్ -దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు 'అవుట్' నుంచి తప్పించుకునేందుకు ఒకరితో ఒకరు పోటీ పడిన అరుదైన సన్నివేశం ఆవిష్కృతమైంది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో భాగంగా అశ్విన్ వేసిన 30వ ఓవర్ తొలి బంతిని డు ప్లెసిస్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. థర్డ్ మ్యాన్ దిశగా తరలించిన ఆ బంతికి డు ప్లెసిస్ పరుగు తీసేందుకు ముందుకొచ్చాడు. అయితే అవతలి ఎండ్ లో ఉన్న డేవిడ్ మిల్లర్ కూడా పరుగు కోసం సగం క్రీజ్ దాటి వచ్చాడు.
అయితే ఆ బంతిని వేగంగా అందుకున్న బూమ్రా నాన్ స్టైకింగ్ ఎండ్ వైపు వేగంగా విసిరాడు.
దాంతో రనౌట్ తప్పదని భావించిన సఫారీ ఆటగాళ్లు మిల్లర్-డు ప్లెసిస్ తమను అవుట్ నుంచి రక్షించుకునేందుకు స్ట్రైకింగ్ ఎండ్ వైపు వేగంగా పరుగు తీశారు. ఇక నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో బ్యాట్స్‌మన్ ఎవరూ లేకపోవడంతో ఆ బంతిని అందుకున్న కోహ్లి ఎటువంటి తడబాటు లేకుండా వికెట్లను ఎగురేశాడు. కాగా, అసలు అవుట్ ఎవరయ్యారనే దాని కోసం ఫీల్డ్ అంపైర్లు.. థర్డ్ అంపైర్ రివ్యూను కోరాల్సి వచ్చింది. ఇక్కడ మిల్లర్ అవుట్ గా పెవిలియన్ చేరాడు.
ఏదేమైనా కీలక దశలో తీవ్ర గందరగోళానికి గురై వికెట్ కాపాడుకోవడం కోసం ఒక ఎండ్‌కు పరుగెత్తి మిల్లర్, డుప్లెసిస్ జంట అందించిన తమాషాతో స్టేడియం నవ్వుల్లో మునిగిపోయింది. వాటితో పాటు గేమ్ కూడా సఫారీ జట్టును దాటిపోయింది.