Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెన్నై టెస్ట్ మ్యాచ్ : ఫాలోఆన్ తప్పించుకోవాలంటే భారత్ ఏం చేయాలి?

Advertiesment
Chennai Test Live score
, ఆదివారం, 7 ఫిబ్రవరి 2021 (14:24 IST)
చెన్నై వేదికగా భారత్, ఇంగ్లండ్ క్రికెట్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో పర్యాటక ఇంగ్లండ్ జట్టు పరుగుల వరద పారించింది. ముఖ్యంగా ఆ జట్టు ఆటగాడు రూట్ భారత బౌలర్లను ఆ ఆట ఆడుకున్నాడు. ఫలితంగా రూట్ డబుల్ సెంచరీ కొట్టాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 578 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌ను రెండు రోజుల ఒక సెషన్ పాటు ఆడింది. 
 
ఆ జట్టు ఆటగాళ్లలో ఆటగాళ్లలో రోరీ బుర్న్స్ 33, డామ్ సిబ్లీ 87 పరుగులు చేయగా, వన్ డౌన్‌లో వచ్చిన డాన్ లారెన్స్ డక్కౌట్ అయ్యాడు. ఆపై వచ్చిన కెప్టెన్, 100వ టెస్ట్ మ్యాచ్‌ని ఆడుతున్న జో రూట్ అద్భుత రీతిలో భారత బౌలర్లను ఎదుర్కొని 218 పరుగులు చేయడం ద్వారా, తన సెంచరీ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
 
ఆపై బెన్ స్టోక్స్ 82, ఓలీ పోప్ 34, జోస్ బట్లర్ 30, డామ్ బెస్ 34, జేమ్స్ ఆండర్సన్ 1, జోఫ్రా ఆర్చర్ 0 పరుగులకు అవుట్ కాగా, జాక్ లీచ్ 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక భారత బౌలర్లతో జస్ ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్‌కు మూడేసి వికెట్లు దక్కగా, ఇషాంత్ శర్మ, షాబాజ్ నదీమ్‌కు రెండేసి వికెట్లు లభించాయి. 
 
అయితే, భారత్ ఫాలోఆన్ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే, తప్పకుండా 378 పరుగులు చేయాల్సి వుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ని ఇంగ్లండ్ గెలవడం లేదా డ్రా కావడం మినహా భారత్ గెలిచే అవకాశాలు దాదాపు లేనట్టేనని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 
 
ఇలాంటి పరిస్థితుల్లో తొలి ఇన్నింగ్స్ చేపట్టిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ‌లు తగిలాయి. 44 ప‌రుగుల‌కే టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ 6 ప‌రుగుల‌కే అర్చ‌ర్ బౌలింగ్‌లో కీప‌ర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. 
 
శుభ్‌మ‌న్ గిల్ 29 ప‌రుగులు చేశాక అర్చ‌ర్ బౌలింగ్‌లోనే అండ‌ర్స‌న్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్ర‌స్తుతం క్రీజులో పుజారా(20), కోహ్లీ(4) ఉన్నారు. అతి త‌క్కువ ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోవ‌డంతో భార‌త బ్యాట్స్‌మెన్ పై ఒత్తిడి ప‌డుతోంది. భోజన విరామం సమయానికి టీమిండియా స్కోరు‌ 59/2గా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత బౌలర్లకు చుక్కలు.. అయినా బెన్ స్టోక్స్ అవుట్