Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కృతజ్ఞత లేనివారి తిరుగుబాటు.. ఆత్మగౌరవంతో తప్పుకున్న కోచ్.. బోర్డే పొగపెట్టిందా?

ఆటగాళ్లు స్వేచ్చ కోరుకుంటే దాన్ని వ్యతిరేకించినందుకే కుంబ్లే కోచ్ పదవికి గండం వచ్చిందా? కెప్టెన్ కోహ్లీ, కోచ్ కుంబ్లే అహాల మధ్య సమస్యే అయితే కోచ్ కన్నా కెప్టెన్ కుంబ్లే అహాన్ని బీసీసీఐ గుర్తించలేదా? ఇ

Advertiesment
Indian cricket team
హైదరాబాద్ , బుధవారం, 21 జూన్ 2017 (03:34 IST)
ఆటగాళ్లు స్వేచ్చ కోరుకుంటే దాన్ని వ్యతిరేకించినందుకే కుంబ్లే కోచ్ పదవికి గండం వచ్చిందా? కెప్టెన్ కోహ్లీ, కోచ్ కుంబ్లే అహాల మధ్య సమస్యే అయితే కోచ్ కన్నా కెప్టెన్ కుంబ్లే అహాన్ని బీసీసీఐ గుర్తించలేదా? ఇది హెడ్ మాస్టర్‌కి, స్కూలుపిల్లలకు మద్య జరిగిన తగాదా ఫలితమేనా? లేక కుంబ్లే స్వేచ్ఛా వైఖరితో ఇబ్బంది పడిన బీసీసీఐ స్వయంగా పొగబెట్టి మరీ కుంబ్లేను కోహ్లీ అసంతృప్తి రూపంలో సాగనంపారా? లోతుగా ఆలోచిస్తుంటే కోహ్లీ స్వేచ్ఛ కంటే కుంబ్లే స్వేచ్చను భరించలేకే బీసీసీఐ ఒక జెంటిల్మన్‌ని ఇంత అవమానకరంగా తానే సాగనంపిందా అనిపిస్తోంది. 
 
కోహ్లి, కుంబ్లే మధ్య జరిగింది అహాల మధ్య పోరాటంగా బయటకు కనిపిస్తోంది.. కోహ్లి ఆటగాళ్లకు స్వేచ్ఛను కోరుకునే రకం. అందుకే అతను ‘ఫ్రెండ్లీ’రవిశాస్త్రిలాంటి వ్యక్తిని కోచ్‌గా కావాలనుకున్నాడు. కానీ ఏ స్థాయి ఆటగాడైనా శ్రమించేందుకు వెనుకాడవద్దనేది కుంబ్లే తత్వం. అందుకే ఆటగాళ్లంతా కలిసి అతడిని ‘హెడ్‌ మాస్టర్‌’గా చిత్రీకరించారు. ఆ కఠోర సాధన తమ వల్ల కాదని చేతులెత్తేశారు. ఈ మైదానంలోని అంశాలు కాకుండా ఇద్దరి మధ్య విభేదాలకు ‘వ్యక్తిగత’కారణాలు ఏమైనా ఉన్నాయేమో ప్రస్తుతానికైతే తెలీదు. మధ్యలో అగ్నికి ఆజ్యం పోసినట్లుగా బీసీసీఐ అధికారులు తమ పాత్ర పోషించారు.
 
కోచింగ్‌తో సరిపెట్టకుండా ఆటగాళ్ల ఫీజు పెంచడంవంటి అంశాల్లో దూకుడుగా ముందుకు వెళ్లటం వారిలో చాలా మందికి నచ్చలేదు. దాంతో రోగి కోరిందే వైద్యుడు ఇచ్చాడు అన్నట్లుగా... ఇటు తన మాటే చెల్లుబాటు కావాలనుకుంటున్న కోహ్లి వ్యతిరేకతకు బోర్డు ఆలోచన కూడా తోడై కుంబ్లేను సాగనంపారు. 
 
క్రికెట్‌లో కోచ్‌ పాత్ర తక్కువే కావచ్చు... కానీ ఆటగాడిగా, కెప్టెన్‌గా ‘జెంటిల్‌మెన్‌’ ఇమేజ్‌ సంపాదించిన కుంబ్లే కోచ్‌గా ఉండటం జట్టుకు కచ్చితంగా మేలు చేసే విషయం.  అతని సేవలను కోల్పోతే నష్టపోయేది కుంబ్లే మాత్రం కాదు. మాజీ క్రికెటర్‌ బిషన్‌ సింగ్‌ బేడి తాజా పరిణామాన్ని విశ్లేషిస్తూ  ‘ఆత్మగౌరవం ఉన్న కుంబ్లే లాంటి వ్యక్తి అక్కడ పని చేయలేడు. అతనిపై తిరుగుబాటు చేస్తున్నవారంతా కృతజ్ఞత లేనివారే. చివరకు భారత క్రికెట్టే నష్టపోతుంది’ అని వ్యాఖ్యానించడం కుంబ్లే విలువను చూపిస్తోంది.  
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుండె పగిలి కోచ్ పదవికి రాజీనామా చేసిన కుంబ్లే.. అకుంఠిత దీక్షకు ఘోరావమానం