Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'చక్‌దే' ఫేంకు బుక్కైపోయిన జహీర్ ఖాన్.... 38 యేళ్ల బ్యాచిలర్ లైఫ్‌కు స్వస్తి

భారత క్రికెటర్ జహీర్ ఖాన్ తన 38 యేళ్ల బ్యాచిలర్ లైఫ్‌కు స్వస్తి చెప్పాడు. 'చెక్‌దే' ఫేం నటి సాగరిక ఘట్గేతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. నిజానికి గత కొంతకాలంగా వీరిద్దరు ప్రేమాయణం కొనసాగిస్తూ వచ్చిన విష

'చక్‌దే' ఫేంకు బుక్కైపోయిన జహీర్ ఖాన్.... 38 యేళ్ల బ్యాచిలర్ లైఫ్‌కు స్వస్తి
, మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (12:12 IST)
భారత క్రికెటర్ జహీర్ ఖాన్ తన 38 యేళ్ల బ్యాచిలర్ లైఫ్‌కు స్వస్తి చెప్పాడు. 'చెక్‌దే' ఫేం నటి సాగరిక ఘట్గేతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు. నిజానికి గత కొంతకాలంగా వీరిద్దరు ప్రేమాయణం కొనసాగిస్తూ వచ్చిన విషయం తెల్సిందే. ఇపుడు ఆమెతోనే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్టు ప్రకటించి జహీర్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.
 
ఈ సందర్భంగా సాగరితో కలిసి ఉన్న ఒక ఫొటోను జహీర్‌ ఖాన్ అభిమానులతో పంచుకున్నాడు. అందులో సాగరిక తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ ఫొటోకు పోజిచ్చింది. ఈ ఫోటో కింద ట్వీట్స్ చేశాడు. 'మీ భార్య ఎంపికల్ని చూసి నవ్వకండి. ఎందుకంటే మీరు కూడా అందులో భాగమే. ఇక నుంచి జీవితాంతం భాగస్వాములమే' అని సాగరిక చేతికి ఉంగరం పెట్టిన పెట్టిన ఫోటోను జహీర్ ఖాన్ ట్వీట్ చేశాడు. దీనికితోడు 'ఎంగేజ్‌మెంట్ అయింది' అనే హ్యాష్‌ ట్యాగ్‌ను ఈ ట్వీట్‌కు జోడించాడు.
 
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. సాగరికతో ఎంగేజ్‌మెంట్ సందర్భంగా జహీర్ ఖాన్‌కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లేలతో పాటు మహమ్మద్ కైఫ్ తదితరులు ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్‌లోనే అతను బెస్ట్ బౌలర్.. కానీ ఆరోజు ధోనీ రోజు..ఎవరైనా తేలిపోవలసిందే