Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చావుకబురు చల్లగా చెప్పడం అంటే ఇదేనా గంగూలీ.. ఐదు నెలల కోచ్‌పై ఇంత రగడ ఎందుకు?

ముందుగా స్పష్టత లేకుండా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా వాటిపై వెనువెంటనే నిర్ణయాలు తీసుకుంటే ఫలితం ఎలా ఉంటుందనేది టీమ్ఇండియా బౌలింగ్ కోచ్‌లో బీసీసీఐ చేస్తున్న కుప్పిగంతలను బట్టి ఎవరైనా తెలుసుకోవచ్చు. జట్టుకు పూర్తి కాలం అందుబాటులో లేని జహీర్ ఖాన్‌‌ని బ

Advertiesment
Zaheer Khan
హైదరాబాద్ , శనివారం, 15 జులై 2017 (05:15 IST)
ముందుగా స్పష్టత లేకుండా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా వాటిపై వెనువెంటనే నిర్ణయాలు తీసుకుంటే ఫలితం ఎలా ఉంటుందనేది టీమ్ఇండియా బౌలింగ్ కోచ్‌లో బీసీసీఐ చేస్తున్న కుప్పిగంతలను బట్టి ఎవరైనా తెలుసుకోవచ్చు. జట్టుకు పూర్తి కాలం అందుబాటులో లేని జహీర్ ఖాన్‌‌ని బౌలింగ్ కోచ్‌గా తీసుకోవడమే తప్పు. ఒకవేళ తీసుకున్నా అతడి పరిమితులపై అంచనా లేకుండా బౌలింగ్ కోచ్ అంటూ అనాలోచితంగా ప్రకటనలు చేయడం మరొక తప్పు. ఈ మధ్యకాలంలో అటు హెడ్ కోచ్ రవిశాస్త్రి, ఇటు భారత క్రికెట్ సలహా మండలి నేరుగా మీడియాతో వివాదాస్పద ప్రకటనలు గుప్పించడం అవి ఫేస్‌బుక్ సోషల్ మీడియాలో ఉండే హైపర్ జీవులకు బీపీ పెరిగిపోవడం. దాంతో తమ స్ట్రెస్‌ని తగ్గించుకోవడం కోసం ఎవరికి తోచిన కామెంట్లు, శాపనార్తాలు రవిశాస్త్రిపై, కోహ్లిపై  కుమ్మరించడం.. వినడానికే అసంబద్ధంగా, అసహజంగా ఉన్న ఇలాంటి వాదోపవాదాలు టీమిండియా ప్రయోజనాలకేనా అనిపిస్తోంది.
 
కోల్‌కతా టీమిండియా బౌలింగ్‌ కన్సల్టెంట్‌గా ఎంపికైన జహీర్‌ ఖాన్‌ ఏడాదిలో 150 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటారని క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) సభ్యుడు సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశారు. దీంతో జహీర్‌ జట్టుకు పూర్తి స్థాయి బౌలింగ్‌ కోచ్‌ కాదనే విషయంలో స్పష్టత వచ్చినట్టయ్యింది. అటు బీసీసీఐ కూడా ఇప్పటికే జహీర్‌ నియామకం ఆయా పర్యటనల వారీగా సేవలందించే వరకేనని పేర్కొంది.
 
మరోవైపు తాను కేవలం వంద రోజుల వరకే సేవలందించగలనని జహీర్‌ స్పష్టం చేసినా... సీఏసీ ఒత్తిడి మేరకు తనతో 150 రోజుల ఒప్పందం కుదిరింది. ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రిని నియమించిన అనంతరం సహాయక కోచ్‌లుగా జహీర్, రాహుల్‌ ద్రవిడ్‌ల ఎంపిక అనేక మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. జహీర్‌ స్థానంలో పూర్తి స్థాయి కోచ్‌గా భరత్‌ అరుణ్‌ను తీసుకోవాలని రవిశాస్త్రి గట్టిగా పట్టుబడుతున్నారు.
 
జహీర్ బౌలింక్ కోచ్ పరిమితులపై ముందస్తు అంచనాకు రాకుండా అటు రవిశాస్త్రి, ఇటు క్రికెట్ సలహా కమిటీ తరపున గంగూలీ ఇష్టానుసారం ప్రకటనలు చేస్తూ పరస్పరం సవాలు చేసుకోవడం పిల్ల చేష్ట్యగా కనిపిస్తోంది. ఇంతలో సంబడానికి నాలుగు రోజులు కొట్లాడుకోవాలా అని నెటిజన్లు పరాచకాలకు దిగుతున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంగక్కర కొట్టిన సిక్స్.. స్మార్ట్ ఫోన్‌ను పగులకొట్టింది.. వీడియో చూడండి..