Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచ కప్ సెమీస్‌లో భారత్‌ను ఢీకొట్టే జట్టేది?

rohit sharma
, సోమవారం, 6 నవంబరు 2023 (13:58 IST)
స్వదేశంలో ఐసీసీ వన్డే ప్రపచం కప్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. దాదాపుగా అన్ని లీగ్ మ్యాచ్‌లు ముగింపు దశకు వచ్చాయి. ఈ టోర్నీలో ఇప్పటికే భారత్, సౌతాఫ్రికా జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. మూడు, నాలుగు స్థానాల్లో ఏ జట్టు నిలుస్తుందా? అన్నదే ఇపుడు చర్చనీయాంశంగా మారింది. మిగిలిన రెండు స్థానాల కోసం నాలుగు జట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. 
 
భారత్, సౌతాఫ్రికా తర్వాత ఆస్ట్రేలియా జట్టు సెమీస్‌కు చేరుకోనుంది. అయితే, ఆ జట్టు ఏ స్థానంలో నిలుస్తున్నది ఇపుడు తెలియాల్సివుంది. ఏడు మ్యాచ్‌లలో ఐదు విజయాలతో పది పాయింట్లతో కొనసాగుతుంది. ఇంకా ఆ జట్టు రెండు మ్యాచ్‌లు ఆడాల్సివుంది. ఆప్ఘాన్, బంగ్లాదేశ్‌లతో తలపడాల్సివుంది. ఆప్ఘాన్‌తో కాస్త ప్రమాదమే అయినప్పటికీ బంగ్లాదేశ్‌పై సునాయాసంగా గెలిచే అవకాశం ఉంది. ఈ రెండు మ్యాచ్‌లలో ఒక్క మ్యాచ్ గెలిచినా ఆ జట్టు సెమీస్‌లోకి అడుగుపెడుతుంది. 
 
ఆ తర్వాత న్యూజిలాండ్ జట్టు ఉంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లలో గెలిచి సెమీస్ వైపు పరుగులు తీసింది. కానీ, ఆ తర్వాత కివీస్‌కు కష్టాలు ఎదురయ్యాయి. వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. మొత్తం 8 మ్యాచ్‌లు ఆడిన కివీస్ నాలుగు విజయాలు, నాలుగు ఓటములతో ఎనిమిది పాయింట్లను సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది చివరి మ్యాచ్‌ను ఈ నెల 9వ తేదీన శ్రీలంకతో ఆడనుంది. 
 
ఇందులో గెలిచినా ఆ జట్టు సెమీస్‌కు చేరుతుందన్న నమ్మకం లేదు. పాక్, ఆప్ఘాన్ జట్లు తాము ఆడే చివరి మ్యాచ్‌లలో ఓడిపోతేనే కివీస్ జట్టుకు సెమీస్ స్థానం ఖరారవుతుంది. ఒకవేళ శ్రీలంక చేతిలో ఓడిపోయినా కివీస్ జట్టు సెమీస్ ఆశలను వదులుకోవాల్సి వస్తుంది. నెట్‌రన్ రేట్ ప్రకారం బెర్తు దక్కే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. 
 
అలాగే, పాకిస్థాన్ ఆటతీరును చూస్తే ఎవరు కూడా సెమీస్‌కు చేరుతుందని భావించలేదు. అందుకే ఆ పాక్‌ను ప్రతి ఒక్కరూ అంచనాలకు అందని జట్టుగా అభివర్ణిస్తుంటారు. ఈ ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లలో నాలుగు విజయాలు, నాలుగు ఓటములతో 8 పాయింట్లను కూడబెట్టుకుంది. గత మ్యాచ్‌లో కివీస్‌పై అద్భతమైన విజయంతో తన సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. తన చివరి మ్యాచ్‌ను ఈ నె 14వ తేదీన ఇంగ్లండ్‌తో తలపడాల్సివుంది. ఇందులో పాకిస్థాన్ భారీ విజయం సాధిస్తే మాత్రం సెమీస్ బెర్తు ఖాయమవుతుంది. ఒక వేళ ఓడినా సెమీస్‌కు చేరే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇతర జట్ల ఫలితాలు, రన్‌రేట్ కీలకంగా మారనుంది. 
 
ఈ టోర్నీలో సంచలన విజయాలు నమోదు చేసిన ఆప్ఘనిస్థాన్.. ఇంగ్లండ్‌ను ఓడించిన తర్వాత కివీస్‌ చేతిలో ఘోరంగా ఓడిపోయి, ఆ తర్వాత పుంజుకున్న తీరు అద్భుతమని చెప్పొచ్చు. వరుసగా శ్రీలంక, పాకిస్థాన్, నెదర్లాండ్స్‌లను మట్టికరిపించి సెమీస్ రేసులోకి దూసుకొచ్చింది ప్రస్తుతం ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, మూడు ఓటములతో 8 పాయింట్లను తన ఖాతాలో ఉన్నాయి. కివీస్, పాకిస్థాన్‌లతో పోల్చితే సెమీస్‌కు చేరే అవకాశాలు ఆప్ఘనిస్థాన్‌కే అధికంగా ఉన్నాయి. 
 
అయితే, తన చివరి రెండు మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వంటి బలమైన జట్లతో తలపడాల్సివుంది. ఈ మ్యాచ్‌లలో ఒక్క మ్యాచ్ గెలిచినా సంచలన విజయం నమోదు చేస్తే మాత్రం ఆప్ఘాన్ జట్టు సెమీస్‌లోకి వస్తుంది. ఒకవేళ రెండు మ్యాచ్‌లలో గెలిస్తే మాత్రం పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు రెండు ఇంటి ముఖం పట్టాల్సి వుంటుంది ఇకపోతే, పాయింట్ల పరంగా భారత్‌ను ఇతర జట్లూ తాకే స్థితిలో లేవు. 8 మ్యాచ్‌లలో ఎనిమిదింటిలో విజయం సాధించి 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు రెండు, మూడు స్థానాల్లో సౌతాఫ్రికా లేదా ఆస్ట్రేలియా ఉండొచ్చు. నాలుగో స్థానంలో ఏ జట్టు నిలుస్తుందన్నది ఇపుడు మిలియన్ డాలర్ల సమస్యగా ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ : సౌతాఫ్రికా వెన్ను విరిచిన రవీంద్ర జడేజా...