Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆసియా కప్ టీ-20.. థాయ్‌ను చిత్తు చేసిన టీమిండియా

Advertiesment
indian women team
, సోమవారం, 10 అక్టోబరు 2022 (22:23 IST)
మహిళల ఆసియా కప్ టీ-20 క్రికెట్‌ టోర్నీలో భారత మహిళా జట్టు మెరిసింది. మరోసారి లీగ్ మ్యాచ్‌లో సత్తా చాటింది. సెమీఫైనల్లోకి ఇప్పటికే అడుగుపెట్టిన భారత మహిళా జట్టు థాయ్‌లాండ్‌కు చుక్కలు చూపించారు. 
 
తొలుత బౌలింగ్‌లో దుమ్మురేపిన టీమిండియా.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో సత్తా చాటింది. థాయిలాండ్ సెట్ చేసిన 38 పరుగుల టార్గెట్‌ను కేవలం ఆరు ఓవర్లలో ఫినిష్ చేసింది. 38 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 6 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 40 పరుగులు చేసింది. 
 
భారత స్పిన్నర్ల దెబ్బకి 37 పరుగులకే ఆలౌట్ అయింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన థాయిలాండ్ 15.1 ఓవర్లలో 37 పరుగులు మాత్రమే చేసింది. ఈ ఆసియా కప్ లో పాకిస్తాన్‌ను ఓడించిన థాయిలాండ్ జట్టు ఈ మ్యాచులో మాత్రం టీమిండియా ముందు తేలిపోయింది.  
 
ఈ విజయంతో ఆసియా కప్ లీగ్ స్టేజీలో 10 పాయింట్లతో టాప్ ప్లేసులో నిలిచింది టీమిండియా. రేపు జరిగే మ్యాచుల ద్వారా టీమిండియా సెమీస్ ప్రత్యర్థి ఎవరో తేలనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వ‌న్డే ఫార్మాట్‌లో 300 విజ‌యాలు.. టీమిండియాకు అరుదైన గుర్తింపు