అంతర్జాతీయ వన్డే ఫార్మాట్‌లో 300 విజయాలను సాధించిన జట్టుగా టీమిండియాకు అరుదైన గుర్తింపు లభించింది. ఇప్పటికే ఈ ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా గుర్తింపు పొందిన టీమిండియా టీమిండియా... ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో విజయంతో '300' విక్టరీ మార్కును అందుకుంది.
ఈ ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా టీమిండియా కొనసాగుతుండగా... 257 విజయాలతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో, 247 విజయాలతో వెస్టిండీస్ మూడో స్థానంలో కొనసాగుతున్నాయి.