Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కుంబ్లే కోచ్‌గా ఫెయిలయ్యాడా.. తనతో పనిలేకుండానే అన్ని సీరీస్ గెలిచామా.. గంగూలీ మాటలకు అర్థం ఏమిటి?

టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లేకు, కెప్టెన్ విరాట్ కోహ్లీకి, జట్టు సభ్యులకు మధ్య వ్యవహారం శ్రుతిమించిందన్న విషయం భారత క్రికెట్ సలహా మండలికి ఆరునెలల ముందే తెలిసిందా? తెలిసినప్పటికీ కోచ్- కెప్టెన్ మధ్య సమావేశం ఎందుకు నిర్వహించలేదు. కోహ్లీ తనపై అంత అవిశ్వా

కుంబ్లే కోచ్‌గా ఫెయిలయ్యాడా.. తనతో పనిలేకుండానే అన్ని సీరీస్ గెలిచామా.. గంగూలీ మాటలకు అర్థం ఏమిటి?
హైదరాబాద్ , సోమవారం, 26 జూన్ 2017 (01:23 IST)
టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లేకు, కెప్టెన్ విరాట్ కోహ్లీకి, జట్టు సభ్యులకు మధ్య వ్యవహారం శ్రుతిమించిందన్న విషయం భారత క్రికెట్ సలహా మండలికి ఆరునెలల ముందే తెలిసిందా? తెలిసినప్పటికీ కోచ్- కెప్టెన్ మధ్య సమావేశం ఎందుకు నిర్వహించలేదు. కోహ్లీ తనపై అంత అవిశ్వాసం ప్రకటించాడన్న విషయం చివరి నిమిషం వరకు కుంబ్లేకి నిజంగానే తెలీలేదా. అదే నిజమైతే భారత సలహా మండలి కూడా కుంబ్లేని సాగనంపాలని ముందే నిర్ణయానికి వచ్చేసినట్లే లెక్క.  తాజాగా సలహామండలిలోని త్రిమూర్తులలో ఒకరైన సౌరవ్ గంగూలీ ప్రకటనను పరిశీలిస్తే కుంబ్లే తొలగింపు సడెన్‌గా తీసుకున్నది కాదని తేలుతోంది. 
 
జట్టులోని సభ్యులను సమన్వయం చేసుకుపోయే మనస్తత్వం, కెప్టెన్‌ నిర్ణయాలను గౌరవించే వ్యక్తికోసం సలహా కమిటీ సభ్యులు వెతుకున్నారని గంగూలీ స్వయంగా చెప్పాడంటే సలహా మండలి సభ్యులైన సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్, గంగూలీ కూడా తప్పంతా కుంబ్లేపైనే పెడుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. కోచ్‌కు ఇవ్వాల్సిన కనీస గౌరవం ఏమిటో గవాస్కర్ అంత స్పష్టంగా తేల్చి చెప్పిన తర్వాత కూడా సలహామండలి ఒక్కసారంటే ఒక్కసారి కూడా కుంబ్లే రాజీనామాపై వ్యాఖ్యానించకపోవడం చూస్తుంటే ఈ త్రిమూర్తులు కూడా కెప్టెన్‌ను వెనుకేసుకొచ్చే క్రమంలో కుంబ్లేని బలి చేశారనే స్పష్టమవుతోంది.
 
ఇటీవల కెప్టెన్‌ విరాట్ కోహ్లీకి మధ్య విభేదాల నేపధ్యంలో కుంబ్లే తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కనీసం వెస్టిండీస్‌ పర్యటన వరకైనా కొనసాగమని క్రికెట్‌ సలహా మండలి అభ్యర్ధనను కుంబ్లే తిరస్కరించాడు. అయితే తర్వాతి కోచ్‌ ఎవరు అనేదానిపై సస్సెన్స్‌కు మాత్రం సమాధానం లభించట్లేదు. అయితే దీనిపై తాజాగా సలహా మండలి సభ్యుడు సౌరవ్‌ గంగూలీ బీసీసీఐ సమావేశంలో స్పందించాడు.
 
త్రిసభ్య సలహా కమిటీ సరైన కోచ్‌ కోసం అన్వేషిస్తోందని తెలిపాడు. జట్టులోని సభ్యులను సమన్వయం చేసుకుపోయే మనస్తత్వం, కెప్టెన్‌ నిర్ణయాలను గౌరవించే వ్యక్తికోసం సలహా కమిటీ సభ్యులు వెతుకున్నారని తెలిపాడు. సరైన ప్రణాళికలతో మ్యాచ్‌లను గెలిపించగలిగే సత్తా ఉన్నవాడినే కోచ్‌గా ఎంపిక చేస్తామని సౌరవ్‌ పేర్కన్నాడు. దీనికోసం మళ్లీ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, జూలై 9లోపు కొత్త దరఖాస్తులను పంపవచ్చని చెప్పాడు. 
 
గతంలో దరఖాస్తు చేసుకున్న వారినికూడా పరిగణలోకి తీసుకుంటామని అన్నాడు. కోచ్‌ ఎంపికలో బీసీసీఐ సూచనలు తీసుకుంటామని సౌరవ్‌  తెలిపాడు. జూలై 21 నుంచి ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటనలోపే కోచ్‌ ఎంపిక చేస్తామని గంగూలీ చెప్పాడు. కోహ్లీ కుంబ్లే వివాదాలను దృష్టిలో ఉంచుకుని కొత్తకోచ్‌ ఎంపిక చేస్తామని, దీని కోసం ప్రస్తుతం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని బీసీసీఐ వర్కింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అమితాబ్‌ చౌదరి అన్నారు.
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెండో వన్డేలో విరగబాదిన టీమిండియా.. విండీస్‌కు 311 పరుగుల విజయలక్ష్యం