Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రెండో వన్డేలో విరగబాదిన టీమిండియా.. విండీస్‌కు 311 పరుగుల విజయలక్ష్యం

పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌‌లో భారత్‌-వెస్టిండీస్‌ మధ్య ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ట్రినిడాడ్‌లో జరిగిన రెండో వన్డేలో టాస్ ఓడి బ్యాటింగుకు దిగిన టీమిండియా ఓపెనర్ల విజృంభణతో భారీ స్కోరు సాధించింది.

రెండో వన్డేలో విరగబాదిన టీమిండియా.. విండీస్‌కు 311 పరుగుల విజయలక్ష్యం
హైదరాబాద్ , సోమవారం, 26 జూన్ 2017 (00:41 IST)
పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌‌లో భారత్‌-వెస్టిండీస్‌ మధ్య ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ట్రినిడాడ్‌లో జరిగిన రెండో వన్డేలో టాస్ ఓడి బ్యాటింగుకు దిగిన టీమిండియా ఓపెనర్ల విజృంభణతో భారీ స్కోరు సాధించింది. రెండో వన్డేకి వర్షం వల్ల ఆటంకం కలగడంతో అంపైర్లు మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించగా ముందు జాగ్రత్తగా తొలినుంచి  దూకుడుగా ఆడిన భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసి విండీస్‌కి భారీ లక్ష్యం విధించింది. 
 
ఓపెనర్లు అజింక్యా రహానే సెంచరీతో ధావన్ అర్ధ సెంచరీతో శుభారంభం అందించారు. తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా విండీస్ జట్టుపై విరుచుకుపడి మెరుపువేగంతో 66 బంతులకే 87 పరుగులు చేశాడు. రహానె(103: 104 బంతుల్లో 10×4, 2×6) శతకంతో విజృంభించగా శిఖర్‌ ధావన్‌(63: 59 బంతుల్లో 10×4), విరాట్‌ కోహ్లి(87: 66 బంతుల్లో 4×4, 4×6) అర్ధశతకాలతో రాణించడంతో 43 ఓవర్లలో భారత్‌ 5 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. 
 
ఈ మ్యాచ్‌లోనూ విండీస్‌ బౌలర్లు భారత్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయలేకపోయారు. భారత బ్యాట్స్‌మెన్ దూకుడు ముందు విండీస్ బౌలర్లు తేలిపోవడమే కాదు. వైడ్లు, నో బాల్స్ తో లయ తప్పారు. చివరి ఓవర్లోనే విండీస్ బౌలర్ జాసన్ హోల్డర్ 3 నోబాల్స్ వేశాడంటే విండీస్ బౌలింగ్ ఎంత పేలవంగా మారిందీ అర్థమవుతుంది. జోసెఫ్‌ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టగా.. హోల్డర్‌, నర్స్‌, కమిన్స్‌ తలో వికెట్‌ తీశారు.
 
వెస్టిండీస్‌ రెండో వన్డేలో టీంఇండియా  ఓపెనర్‌ అజింక్యా రహానే శతకం సాధించాడు. గత కొద్ది రోజులుగా నిలకడలేమి ఆటతో సతమతవుతున్న రహానే ఎట్టకేలకు శతకం బాది తన సత్తా చాటాడు.  గత చాంపియన్స్‌ ట్రోఫీలో రహానే నిలకడలేమి ఆటతో బెంచ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో కూడా రహానే అర్ధశతకం సాధించాడు. కానీ ఈ మ్యాచ్‌ వర్షంతో రద్దయింది. 
 
దూకుడుగా ఆడే ప్రయత్నంలో ధావన్‌(63) అష్లే నర్స్‌ బౌలింగ్‌లో స్టంప్‌ అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ కోహ్లీతో రహానే ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. రహానే 56 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించాడు. తర్వాత మరింత దూకుడు పెంచిన రహానే 102 బంతుల్లో 10 ఫోర్లు, 2సిక్సర్లతో కెరీర్‌లో మూడో శతకం సాధించాడు. అనంతరం క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 
 
311 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన విండీస్ జట్టు 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ : చరిత్ర సృష్టించిన శ్రీకాంత్...