Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఢిల్లీలో కాలుష్యం.. వీడియోలో కోహ్లీ.. దయచేసి సమస్యను పరిష్కరించండి మహాప్రభో..

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంపై టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో ఢిల్లీ వాసి అయిన కోహ్లీ ఏం

Advertiesment
Watch video: Virat Kohli worried
, మంగళవారం, 8 నవంబరు 2016 (17:48 IST)
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంపై టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అందులో ఢిల్లీ వాసి అయిన కోహ్లీ ఏం మాట్లాడాడంటే..? ఢిల్లీ కాలుష్యంపై ఆవేదన వ్యక్తపరిచాడు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించుకోవాలన్నాడు. కాలుష్యంపై చింతిస్తున్నట్లు తెలిపాడు. 
 
అయితే ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా నవంబర్ 9 నుంచి రాజ్‌కోట్‌లో జరిగే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌ కోసం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. కాగా 2015 ఆగస్టులో పూర్తి స్థాయి టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కోహ్లీ వరుసగా నాలుగు టెస్ట్ సిరీస్‌లను గెలుచుకుంటూ వచ్చాడు.
 
కాగా ఢిల్లీలో దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. ఢిల్లీని ఒక గ్యాస్ చాంబర్‌గా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అభివర్ణించగా, భూమి మీద అత్యంత కాలుష్య నగరం ఢిల్లీ అని అమెరికాకు చెందిన వాతావరణ రక్షణ ఏజెన్సీ ప్రకటించింది. ఈ దట్టమైన పొగమంచు కారణంగా సిటీలో జరగాల్సిన రెండు రంజీ మ్యాచ్‌లు సైతం రద్దయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చేతిలో చిల్లిగవ్వ లేదు.. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌ను నిర్వహించలేం : బీసీసీఐ