Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చేతిలో చిల్లిగవ్వ లేదు.. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌ను నిర్వహించలేం : బీసీసీఐ

తమ చేతిలో చిల్లిగవ్వలేదనీ అందువల్ల ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌లో తొలి టెస్ట్ మ్యాచ్‌లో నిర్వహించలేమని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు తేల్చిచెప్పింది.

Advertiesment
No Funds
, మంగళవారం, 8 నవంబరు 2016 (12:34 IST)
తమ చేతిలో చిల్లిగవ్వలేదనీ అందువల్ల ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్‌లో తొలి టెస్ట్ మ్యాచ్‌లో నిర్వహించలేమని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు తేల్చిచెప్పింది. లోథా కమిటీ సిఫారసుల అమలు గురించి పూర్తి స్పష్టత వచ్చేవరకు రాష్ట్ర క్రీడా సంఘాలకు ఎలాంటి నిధులూ మంజూరు చేయకూడదని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలు ఏకంగా టెస్ట్‌ మ్యాచ్‌ నిర్వహణే బీసీసీఐకి తలకు మించిన భారంగా పరిణమించింది. 
 
ఈ తీర్పు నేపథ్యంలో ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ను ఎలా నిర్వహించాలని బీసీసీఐ తల పట్టుకుంటోంది. అన్నింటి కంటే ముఖ్యంగా బుధవారం నుంచి రాజ్‌కోట్‌లో ప్రారంభం కానున్న తొలిటెస్టు నిర్వహణకు నిధులు ఎలా సమకూర్చుకోవాలన్న సమస్య వెంటాడుతోంది. అందుకే సుప్రీంకోర్డులో కేసు వేసింది. తొలి టెస్టుకు సంబంధించినంతవరకు తమకు తగినన్ని నిధులను విడుదల చేయాలని కోర్టును కోరింది. ఈ పిటీషన్‌పై మంగళవారం విచారణ జరగనుంది.
 
కాగా, ప్రపంచంలోనే ధనిక క్రికెట్‌ బోర్డుగా బీసీసీఐకు గుర్తింపు ఉంది. కానీ ఇపుడు లోథా కమిటీ సిఫార్సుల కారణంగా టెస్ట్ మ్యాచ్‌ను నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఈ టూర్‌కి సంబంధించి ఇంగ్లండ్‌ ఆటగాళ్ల హోటల్‌, ప్రయాణ ఖర్చులు మీరే భరించండి అని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డుకు బీసీసీఐ విజ్ఞప్తి చేసింది కూడా. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సోషల్ మీడియాలో కాదు.. సామాజిక కార్యక్రమాల్లో సచిన్ యాక్టివ్.. మితాహారాన్ని?