Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ : ఇంగ్లండ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ కోసం గౌహతికి చేరుకున్న భారత్

team india
, శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (10:22 IST)
స్వదేశంలో ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల కోసం భారత్ సర్వసన్నద్ధమైంది. స్వదేశంలో జరుగుతున్న టోర్నీ కావడంతో విజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉంది. ఈ టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కేవసం చేసుకుంది. చివరి మ్యాచ్‌లో ఎదురైన ఓటమి అనేక గుణపాఠాలు నేర్పించింది.
 
ఏదిఏమైనా ఈ టోర్నీలో పాల్గొనే అతిపెద్ద జట్లలో ఒకటైన ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను చేజిక్కించుకోవడం, ప్రధాన బ్యాట్స్‌మెన్, బౌలర్లు అందరూ ఫామ్‌లో ఉండడం వంటి సానుకూల అంశాలతో టీమిండియా శిబిరంలో ఆత్మవిశ్వాసం ఉరకలెత్తుతోంది.
 
ఈ నేపథ్యంలో, వరల్డ్ కప్ సన్నాహకాల కోసం టీమిండియా క్రికెటర్లు గురువారం గౌహతికి చేరుకుంది. ఇక్కడ వారికి ఘనస్వాగతం లభించింది. వరల్డ్ కప్ సన్నద్ధతలో భాగంగా టీమిండియా... గత వరల్డ్ కప్ విజేత ఇంగ్లండ్‌‌తో సెప్టెంబరు 30న తొలి వార్మప్ మ్యాచ్ ఆడనుంది. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం ఈ ప్రాక్టీసు మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. ఆ తర్వాత అక్టోబరు 3న తిరువనంతపురంలో జరిగే రెండో వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా... నెదర్లాండ్స్‌తో తలపడనుంది. 
 
వరల్డ్ కప్ టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్‌ను అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో చెన్నైలో తలపడనుంది. అక్టోబరు 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత్‌లో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాక్ క్రికెటర్లకు నోరూరించే వంటకాలు... డైట్ చార్ట్‌లో మటన్ కర్రీ.. పులావ్...