ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న తొలి టెస్టులో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయాన్ని టీమిండియా క్రికెటర్లు ఎంజాయ్ చేస్తున్నారు. నెటిజన్లు కూడా కోహ్లీ సేనపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. సీనియర్ క్రికెటర్లు కోహ్లీ కెప్టెన్సీ, ఆటగాళ్ల ఆటతీరుపై కితాబిస్తున్నారు.
తాజాగా అడిలైడ్ టెస్టు నాలుగో రోజున హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు.. సీనియర్ బౌలర్ రవిచంద్రన్ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా తప్పుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చకు దారితీసింది.
పరుగుల వరద పారించే రోహిత్ శర్మ.. వికెట్ పడగొట్టిన రవిచంద్రన్ అశ్విన్‌ను కొనియాడే విధంగా షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు చేయిస్తే.. అశ్విన్ పట్టించుకోకుండా తనదారిన పోయాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలతో కూడిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
టెస్టుల్లో నాలుగో రోజైన ఆదివారం భారత జట్టు 301 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఆస్ట్రేలియా జట్టు లక్ష్య చేధనను ఆరంభించింది. ఈ క్రమంలో 12వ ఓవర్ వేసిన అశ్విన్ బౌలింగ్‌లో బంతిని డిఫెన్స్ చేయడంలో విఫలమై.. అరోన్ ఫించ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వెంటనే అంపైర్లు టీ బ్రేక్ ఇవ్వడంతో.. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌తో పాటు భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లింది.
ఆ సమయంలో ఆస్ట్రేలియా తొలి వికెట్ పడగొట్టిన అశ్విన్‌ను అభినందించేందుకు అతడి వెనకే రోహిత్ శర్మ వెళ్లాడు. షేక్‌హ్యాండ్ కోసం కొన్ని క్షణాల పాటు అశ్విన్ వైపు చేయి చూపిస్తూ నడిచాడు. కానీ అశ్విన్ మాత్రం రోహిత్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీంతో వెనకి నుంచి అశ్విన్ భుజంపై తట్టి రోహిత్‌ను అభినందించాడు. ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కరచాలనం ఇచ్చేందుకు కూడా అశ్విన్ ఇష్టపడట్లేదా.. రోహిత్ శర్మను అశ్విన్ అలా నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు.
కాగా అడిలైడ్ టెస్టులో భారత బౌలర్లు ధీటుగా రాణించారు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లను నిలువరించడంతో భారత బౌలర్లు సక్సెస్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లను సాధించాడు. ఆసీస్ కీలక బ్యాట్స్‌మెన్లు హారిస్, ఫించ్‌లను పెవిలియన్ దారి పట్టించి అదుర్స్ అనిపించాడు.