Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ : పాకిస్థాన్‌కు వీసా కష్టాలు

pak team
, ఆదివారం, 24 సెప్టెంబరు 2023 (13:49 IST)
భారత్‌లో వచ్చే నెల ఐదో తేదీ నుంచి ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల కోసం దాయాది దేశం పాకిస్థాన్ కూడా భారత్‌కు రానుంది. అయితే, ఆ జట్టుకు వీసా కష్టాలు ఎదరయ్యాయి. ఆ జట్టు ఆటగాళ్లు, అధికారులకు ఇంకా భారత వీసాలు లభించలేదు. షెడ్యూల్ ప్రకారం పాక్ జట్టు ఈ నెల 25న హైదరాబాద్ నగరానికి చేరుకోవాల్సివుంది. 
 
అంతకుముందు ఆటగాళ్లంతా దుబాయ్ చేరుకొని రెండు రోజులు ప్రాక్టీస్‌లో పాల్గొనాల్సి ఉంది. దుబాయ్ నుంచి నేరుగా హైదరాబాదు రావాలని ముందుగా ప్రణాళిక వేసుకున్నారు. ఈ మేరకు భారత వీసాల కోసం ఇస్లామాబాద్‌లోని భారత ఎంబసీకి పాక్ జట్టు ప్రతినిధులు చేరుకున్నారు. కానీ, వీసా ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని అక్కడి అధికారులు చెప్పడంతో షాకయ్యారు.
 
దీంతో బలవంతంగా దుబాయ్ పర్యటనను రద్దు చేసుకున్నామని పాక్ క్రికెట్ బోర్డు వర్గాలు తెలిపాయి. దుబాయ్ వెళ్లకుండా ఈ నెల 27న నేరుగా హైదరాబాద్ బయలుదేరతామని పేర్కొన్నాయి. ప్రపంచ కప్ సన్నాహకాల్లో భాగంగా పాకిస్థాన్ ఈ నెల 29న హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్ వామప్ మ్యాచ్ ఆడనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆసియా క్రీడల్లో మెరిసిన భారత క్రీడాకారులు.. తొలి రోజున ఐదు బంగారు పతకాలు