భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన భార్య ఆర్తి అహ్లవత్ నుండి విడాకులు తీసుకోబోతున్నారని, వారి 20 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసిన తర్వాత ఊహాగానాలు మరింత బలపడ్డాయి.
వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తి అహ్లవత్ డిసెంబర్ 2004లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి వైవాహిక జీవితం రెండు దశాబ్దాలుగా సజావుగా సాగిందని తెలుస్తోంది. కానీ కొన్ని నెలల క్రితం విభేదాలు తలెత్తాయని, ఈ జంట కొంతకాలంగా విడివిడిగా నివసిస్తున్నారని వర్గాలు చెబుతున్నాయి.
గత దీపావళికి సెహ్వాగ్ తన కుమారులు, తల్లితో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కానీ ఆర్తిని చేర్చలేదు.
ప్రస్తుతానికి, విడాకుల పుకార్లకు సంబంధించి సెహ్వాగ్ లేదా ఆర్తి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. భారతదేశం తరపున 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ20లు ఆడిన ఈ క్రికెటర్ ఈ విషయంపై బహిరంగంగా వ్యాఖ్యానించలేదు.