Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా వంతు రూ.2 కోట్లు... మరి మీ పరిస్థితేంటి? కోవిడ్‌పై కోహ్లీ యుద్ధం

నా వంతు రూ.2 కోట్లు... మరి మీ పరిస్థితేంటి? కోవిడ్‌పై కోహ్లీ యుద్ధం
, శుక్రవారం, 7 మే 2021 (15:52 IST)
కరోనా కష్టకాలంలో కొందరు సినీ సెలబ్రిటీలు తమ వంతుగా సమాజ సేవ చేస్తున్నారు. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో సాయాన్ని అందిస్తూ... తమ గొప్ప హృదయాన్ని చాటుకుంటున్నారు. అలా ప్రజలకు సహాయసహకారాలను అందిస్తున్న వారిలో ఇపుడు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ దంపతులు చేశారు. 
 
క‌రోనా కోర‌ల్లో చిక్కుకుని ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కొంటోన్న భార‌తీయుల‌కు సాయం అందించేందుకు విరాళాన్ని ప్రకటిస్తున్నట్టు తెలిపారు. బాలీవుడ్ నటి, తన భార్య అనుష్కతో కలిసి కోహ్లీ కలిసి తమ వంతుగా రూ.2 కోట్లు విరాళం ప్రకటించారు. దేశంలో అనేక మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారని, వారికి సాయ‌ప‌డాల‌ని వారు వీడియో రూపంలో కోరారు.  
 
మన ఆరోగ్య వ్యవస్థలు సవాలును ఎదుర్కొంటున్న వేళ అంద‌రూ కలిసికట్టుగా ముందుకు రావాల‌ని వారు పిలుపునిచ్చారు. కెట్టో స్వ‌చ్ఛంద‌ సంస్థ‌ ద్వారా ఓ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించామ‌ని, ఎంతో కొంత సాయం చేయాల‌ని కోరారు. తమ  ఉద్యమంలో అందరూ చేరాల‌ని కోరారు. కెట్టోకు విరాళాలు పంపాల‌ని, దాని ద్వారా క‌రోనా రోగుల‌కు సాయం చేయొచ్చ‌ని వారు విజ్ఞ‌ప్తి చేశారు.
 
అలాగే, హీరోయిన్ ప్రణీత కూడా ముందుకువచ్చారు. గత ఏడాది కరోనా సమయంలో కూడా ఆమె తన వంతుగా ఎంతో సాయం చేశారు. కమ్యూనిటీ కిచెన్ కాన్సెప్ట్‌‌తో అవసరమైన వాళ్లకు ఆహారాన్ని అందించారు. ఇప్పుడు కూడా తన ఛారిటీ ద్వారా పలు కార్యక్రమాలను ప్రణీత చేపట్టారు. 
 
ప్రస్తుతం తన సేవా కార్యక్రమాల్లో భాగంగా కరోనా బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లను అందిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆహారం కంటే ఆక్సిజనే ఎంతో అవసరమని... అందుకే తన ఛారిటీ ద్వారా ఆక్సిజన్ ను అందిస్తున్నట్టు ఆమె తెలిపారు. సినీ సెలబ్రిటీలందరూ తమ వంతుగా సమాజానికి సాయపడాలని కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ ఒక్క క్రికెటర్ వల్లే ఐపీఎల్ వాయిదా... రూల్ బ్రేక్ చేయడంతో కాటేసిన కరోనా??