ఒక్క టాలీవుడ్‌లోనే కాకుండా దక్షిణా భారత చలనచిత్ర పరిశ్రమలో తిరుగులేని ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్ అనుష్కశెట్టి. జేజమ్మ, రుద్రమదేవి, దేవసేన వంటి శక్తివంతమైన పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంది.
ఈ మధ్యకాలంలో సెలెక్టివ్‌గా సినిమాల్ని ఎంపిక చేసుకుంటోంది. ఈ అమ్మడి పెళ్లి గురించి గత ఏడాదికాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరికొన్ని మాసాల్లో 40వ యేటలోకి అడుగుపెట్టనుంది. ఈ కన్నడ కస్తూరికి ఈ ఏడాదే పెళ్లి జరిపించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారట.
కొంతకాలంగా మంచి సంబంధం కోసం ఎదురుచూస్తున్న వారికి నచ్చిన అబ్బాయి దొరికాడని సమాచారం. దుబాయ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడితో అనుష్కకు పెళ్లి నిశ్చయించారనే వార్తలు ఇప్పుడు దక్షిణాది సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.
అయితే ఈ పెళ్లి వార్తలపై అనుష్క స్పందించలేదు. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే స్వయంగా ఆమె నుంచే ప్రకటన రావాలని అంటున్నారు. కాగా, గతంలో బాహుబలి చిత్రం షూటింగ్ సమయంలో హీరో ప్రభాస్, అనుష్కలకు వివాహం జరిగిపోయిందనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఇది కేవలం పుకార్లేనని తేలిపోయింది.