కరోనా నేపథ్యంలో లాక్డౌన్ తరుణంలో తన భార్య పుట్టిన రోజు సందర్భంగా భార్య అనుష్క శర్మ కోసం స్వయంగా తొలిసారిగా కేక్ తయారుచేసినట్లు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ తెలిపాడు. తాజాగా మయాంక్ అగర్వాల్‌తో సరదాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న కోహ్లీ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అలా భార్యకు తయారు చేసిపెట్టిన కేక్ తనకు బాగా నచ్చిందని తెలిపాడు. అది తనకెంతో ప్రత్యేకమైందని అనుష్క అతడితో చెప్పినట్లు గుర్తుచేసుకున్నాడు.
ఆ సందర్భం లాక్డౌన్ జ్ఞాపకంగా, తన జీవితంలో ప్రత్యేకమైనదిగా ఎప్పటికీ గుర్తుండిపోతుందని కోహ్లీ తెలిపాడు. దీంతో పాటు ఫిట్‌నెస్‌పై పూర్తి దృష్టి సారించినట్లు తెలిపాడు కోహ్లీ. అయితే స్ల్పిట్, బల్గేరియన్ స్క్వాడ్ వంటి ఎక్స్‌ర్‌సైజ్‌లు చేయడానికి ఎక్కువ ఇష్టపడడని చెప్పాడు. పవర్ స్నాచ్ కసరత్తు చేయడం బాగుంటుందని చెప్పుకొచ్చాడు. బెండకాయతో చేసిన లహ్సునీ పాలక్ వంటకాన్ని ఇష్టపడతానని వెల్లడించాడు.
కాగా లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమైన కోహ్లి రెగ్యులర్ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంతో పాటు, పుస్తకాలు చదవడం, కుటుంబంతో వీలైనంత సమయాన్ని గడపడం ద్వారా కరోనా కాలంలో తనను తాను బిజీగా ఉంచుకుంటున్నాడు.