భారత క్రికెట్ జట్టు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రతి యేడాది ప్రదానం చేసే మూడు అత్యున్నత అవార్డులను కైవసం చేసుకున్నాడు. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ, ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను కోహ్లీ గెలుచుకున్నాడు.
అంతేకాదు, ఐసీసీ టెస్టు, వన్డే టీమ్స్‌కు కెప్టెన్‌గా కూడా కోహ్లీయే నిలవడం విశేషం. 2018లో బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా విరాట్ అత్యున్నత ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.
గతేడాది 13 టెస్టుల్లో 55.08 సగటుతో కోహ్లీ 1,322 పరుగులు చేశాడు. అందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. ఇక 14 వన్డేల్లో 1,202 పరుగులు చేశాడు. సగటు 133.55 కాగా.. అందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. పది టీ20ల్లో 211 పరుగులు చేశాడు.