Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మ్యాచ్ ఓడిపోయారనీ ఆటగాళ్లకు గుండు కొట్టించిన కోచ్... ఎక్కడ?

Advertiesment
U-19 Bengal hockey players
, మంగళవారం, 22 జనవరి 2019 (08:59 IST)
సాధారణంగా ఆటపోటీల్లో గెలుపోటములు సహజం. కానీ, తాను కోచింగ్ ఇచ్చిన జట్టు ప్రత్యర్థి చేతిలో ఓడిపోవడాన్ని కోచ్ జీర్ణించుకోలేక పోయాడు. దీంతో జట్టులోని క్రీడాకారులందరికీ గుండు కొట్టించాడు. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
బెంగాల్ అండర్ -19 హాకీ టీమ్‌ జట్టుకు ఆనంద్ అనే వ్యక్తి కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ పర్యవేక్షణలోని జట్టు.. జూనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో భాగంగా, జబల్‌పూర్‌లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో బెంగాల్ అండర్-19 జట్టు 1-5 తేడాతో నామ్‌దారి ఎలెవన్ జట్టు చేతిలో ఓడిపోయింది. దీన్ని ఆ జట్టు కోచ్ ఆనంద్ జీర్ణించుకోలేక పోయాడు. ఆపై జట్టులో 18 మంది ఆటగాళ్లలో 16 గుండుతో కనిపించారు. అంటే జట్టు కోచ్ పరుష పదజాలంతో దూషించడం వల్లే వారు గుండు కొట్టించుకున్నట్టు సమాచారం. 
 
దీనిపై కోచ్ ఆనంద్ స్పందిస్తూ, ప్రత్యర్థి చేతిలో జట్టు ఓడిపోయినందుకు ఆటగాళ్ళపై ఆగ్రహించిన మాట నిజమేనని, కానీ, గుండుకొట్టించుకోమని తాను ఆదేశించలేదని చెబుతున్నారు. ఈ వ్యవహారం వైరల్ కావడంతో బీహెచ్ఏ కార్యదర్శి స్వపన్ బెనర్జీ విచారణకు ఆదేశించారు. ఈ విచారణ కోసం ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రన్ మిషీన్ రికార్డును బద్ధలు కొట్టిన సౌతాఫ్రికా ప్లేయర్