Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అఫ్రిది ఎవరో తెలియదట.. అయినా ఫోటో తీసుకుంది.. వీడియో వైరల్

Advertiesment
అఫ్రిది ఎవరో తెలియదట.. అయినా ఫోటో తీసుకుంది.. వీడియో వైరల్
, బుధవారం, 13 జనవరి 2021 (07:39 IST)
పాకిస్థాన్ మాజీ స్టార్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిని క్రికెట్ ప్రపంచంలో తెలియని వారంటూ వుండరు. కానీ ఆయనెవరో తెలియదన్నట్లుగా ఓ మహిళ ప్రవర్తించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఏముందంటే.. ఓ మహిళా.. షాహిద్ అఫ్రిదిని బాబు ఇటు రా.. నీ పేరు షాహిద్ అఫ్రిది అంటా.. ఈ అమ్మాయిలు చెబుతున్నారు. రా మాతో ఫోటో తీసుకో అంటూ పిలిచింది. ఇప్పుడు ఆ వీడియో తెగ వైరలవుతోంది. 
 
ఆ వీడియోను చూసిన క్రికెట్ ఫ్యాన్స్ తెగ కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఆమె పిలవగానే స్టార్ క్రికెటర్ హోదాను మరిచి వారితో ఫోటో తీసుకున్నాడు అఫ్రిది. దీంతో అతని మంచితనానికి కూడా లైక్స్ పడుతున్నాయ్. ఈ వీడియో ఎయిర్ పోర్ట్‌లో తీసినట్లు తెలుస్తోంది. కాగా అఫ్రిది గురించి తెలియని వారంటూ వుండరు. విదేశాల్లో అతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేనూ మనిషినే కదయ్యా... చేసిన తప్పుకు క్షమాపణలు : ఆసీస్ కెప్టెన్ పైన్