Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలోని దోమల్నే తరమలేకపోతున్నారు.. సరిహద్దు దాటి వచ్చే దోమల్ని ఎలా..?: గంభీర్

టీమిండియా స్టార్ క్రికెటర్ గౌతం గంభీర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నాడు. క్రికెట్ సంగతిని పక్కనబెడితే.. సామాజిక సమస్యలపై దృష్టి పెట్టాడు. ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కారుపై విరుచుకపడ్డాడు. ఢిల్

దేశంలోని దోమల్నే తరమలేకపోతున్నారు.. సరిహద్దు దాటి వచ్చే దోమల్ని ఎలా..?: గంభీర్
, మంగళవారం, 20 సెప్టెంబరు 2016 (17:06 IST)
టీమిండియా స్టార్ క్రికెటర్ గౌతం గంభీర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నాడు. క్రికెట్ సంగతిని పక్కనబెడితే.. సామాజిక సమస్యలపై దృష్టి పెట్టాడు. ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కారుపై విరుచుకపడ్డాడు. ఢిల్లీలో దోమల బెడదతో డెంగ్యూ, చికెన్ గున్యా వంటి రోగాలు వ్యాపిస్తుంటే.. ఆప్ నేతలు హ్యాపీగా స్టడీ టూర్లు వేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. 
 
తాజాగా.. ట్విట్టర్ ద్వారా గౌతమ్ గంభీర్ ఉగ్రదాడులపై స్పందించాడు. రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించాడు. ఉగ్రదాడులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్న పాకిస్థాన్‌పై ఎలాంటి కఠిన చర్యలూ తీసుకోలేకపోవడంపై సెటైర్లు విసిరాడు. ఉగ్రవాదులను దోమలతో పోల్టాడు. 
 
ఇంకా ట్విట్టర్లో ఏమన్నాడంటే.. "నా బాధ ఏంటంటే మన నేతలు సరిహద్దులు దాటి వచ్చే దోమలను ఆపలేకపోతున్నారు సరికదా, దేశంలోని దోమలను కూడా తరమలేకపోతున్నారు" అంటూ ఎద్దేవా చేశాడు. ఇటీవల కురిసిన వర్షాల తర్వాత ఢిల్లీలో చేరిపోయిన నీటి ద్వారా డెంగ్యూ, చికున్ గున్యా వ్యాధులు విజృంభించాయని గుర్తు చేశాడు. ఈ ట్వీట్‌కు భారీ స్పందన వస్తోంది. గంభీర్ పెట్టిన ట్వీట్‌కు వెయ్యి మందికి పైగా రీ ట్వీట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లియాండర్ పేస్ ఓ విష పురుగు... చాలా ప్రమాదకారి.. సానియా మీర్జా ట్వీట్