Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జేపీఎల్‌: నో బాల్ చెప్పాడని అంపైర్ చెల్లెల్ని చంపేసిన క్రికెటర్ సందీప్ పాల్!

Advertiesment
జేపీఎల్‌: నో బాల్ చెప్పాడని అంపైర్ చెల్లెల్ని చంపేసిన క్రికెటర్ సందీప్ పాల్!
, మంగళవారం, 31 మే 2016 (11:01 IST)
జరారా ప్రీమియర్ లీగ్ (జేపీఎల్) ఈ నెల 14 నుంచి 30వ తేదీ వరకు క్రికెట్ పోటీలు జరిగాయి. గెలిచిన జట్టుకు రూ.5,100 బహుమతి ప్రకటించారు. ఈ నెల 28న జరారా, బరికి జట్ల మధ్య జరిగిన పోరు మాత్రం విషాదానికి దారి తీసింది. అంపైర్ రాజ్ కుమార్ జీవితంలో పెను విషాదానికి కారణమైంది.

అంపైర్ రాజ్ కుమార్ నో బాల్ అంటూ ప్రకటించడంతో క్రికెటర్ సందీప్ పాల్‌ కోపంతో రగిలిపోయాడు. వెంటనే రాజ్ కుమార్ దగ్గరికి వెళ్ళి, గొడవకు దిగాడు. నో బాల్ కాదని చెప్పమన్నాడు. కానీ రాజ్ కుమార్ వినలేదు. దీంతో నీ సంగతేంటే చూస్తానంటూ హెచ్చరించాడు. 
 
ఇవన్నీ మామూలేనని రాజ్ కుమార్ తేలిగ్గా తీసుకున్నాడు. అయితే సందీప్ పాల్ చెప్పినట్టే  ఈ నెల 29న అంపైర్ రాజ్ కుమార్ చెల్లి పూజ (15), మరో ముగ్గురు స్నేహితురాళ్ళు పొలానికి వెళ్తూండగా సందీప్ కూల్ డ్రింక్స్ ఇచ్చాడు. వాటిని తాగిన పూజ మృతి చెందగా, మిగిలిన ముగ్గురూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సందీప్‌ను పూజకు, ఆమె స్నేహితురాళ్ళకు బాగా తెలుసు. అందుకే నమ్మకంగా కూల్ డ్రింక్స్ తాగేశారు.
 
జేపీఎల్ ఖెయిర్ క్రికెట్ కమిటీ అధ్యక్షుడు బాబీ ఖాన్ మాట్లాడుతూ.. గ్రామ పెద్దల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ, వారందర్నీ ఒప్పించి ఈ టోర్నమెంటును నిర్వహించామన్నారు. చివరికి ఇలా జరగడం చాలా విచారకరమని చెప్పారు. పూజ మృతిపైనా, నలుగురు అమ్మాయిలకు విషం ఇవ్వడంపైనా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ ఫైనల్లో రాయల్ ఓడింది.. కంటతడిపెట్టిన సచిన్ బేబీ.. ట్విట్టర్లో ప్రశంసలు..!