Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సఫారీలకు పునరావృతమైన 199 - 2007 వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ ఫలితాలు

South Africa
, శుక్రవారం, 17 నవంబరు 2023 (11:33 IST)
ప్రపంచంలోని మేటి క్రికెట్ జట్లలో సౌతాఫ్రికా ఒకటి. ఆ జట్టులో ఎంతో మంది ప్రపంచ అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్నారు. అదేసమయంలో ఆ జట్టును దురదృష్టం కూడా వెంటాడుతూనే ఉంటుంది. ముఖ్యంగా, ఐసీసీ నిర్వహించే ప్రతిష్టాత్మక ప్రపంచ కప్‌ టోర్నీలో మాత్రం ఆ జట్టుకు ఏమాత్రం కలిసి రావడం లేదు. ముఖ్యంగా, ఐసీసీ వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ మ్యాచ్ ఏమాత్రం అచ్చిరావడం లేదు. 
 
తాజాగా భారత్‌లో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో ఫైనల్‌కు చేరాలన్న ఆ జట్టు కలలు మరోమారు అడియాశలయ్యాయి. గురువారం కోల్‌కతా వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో సౌతాఫ్రికా ఓటమిపాలైంది. 212 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు బౌలర్లు గట్టిగానే పోరాడినప్పటికీ ఆస్ట్రేలియానే అదృష్టం వరించింది. దీంతో ఆసీస్ ఫైనలు చేరగా.. దక్షిణాఫ్రికా ఇంటిదారి పట్టింది. అయితే సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం సౌతాఫ్రికాకు ఇది తొలిసారి కాదు.
 
క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ మరచిపోలేని మ్యాచ్‌లలో 1999 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఒకటి. ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ తొలి బ్యాటింగ్ చేసింది. స్టీవ్ వా, మైఖేల్ బెవాన్ అర్థ సెంచరీలు చేయడంతో ప్రత్యర్థికి 214 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో జాక్వెస్ కల్లిస్ అద్భుతంగా ఆడి అర్థశతకం నమోదు చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా బౌలర్లు విజృభించారు. 213 పరుగులకే కట్టడి చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. అయితే మెరుగైన కారణంగా ఆస్ట్రేలియా ఫైనల్లో అడుగుపెట్టింది.
 
2007 ప్రపంచ కప్ సెమీస్‌లో ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మరోసారి హోరాహోరీగా తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 149 పరుగులకే ఆలౌట్ అయ్యింది. విజృంభించిన షాన్ టైట్, గ్లెన్ మెక్రోత్ సౌతాఫ్రికా బ్యాటర్లను వణికించారు. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ సులభంగా ఛేదించింది. మైఖేల్ క్లార్క్ అజేయ అర్థ శతకాన్ని నమోదు చేశాడు. దీంతో ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా.. శ్రీలంకను ఓడించి ప్రపంచకప్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. కాగా ఆస్ట్రేలియా మొత్తం ఐదు సార్లు వరల్డ్ కప్ ఫైనల్ చేరుకోవడం గమనార్హం. ఈసారి కప్ కొడితే ఆరుసార్లు గెలుచుకున్న ఏకైక జట్టుగా అవతరించనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌తో అంతిమ పోరు కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నాం : పాట్ కమ్మిన్స్