Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అండర్-19 ప్రపంచ కప్‌.. భారత ఆటగాళ్లకు అవమానం.. ఏం జరిగింది?

Advertiesment
U19 World Cup
, గురువారం, 24 ఫిబ్రవరి 2022 (10:45 IST)
Team India
అండర్-19 ప్రపంచ కప్‌లో టీమిండియా గెలుపును నమోదు చేసుకుంది. ఫైనల్‌లో క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. అయితే వెస్టిండీస్‌లో ఏడుగురు అండర్ 19 టీమిండియా ఆటగాళ్లకు అవమానం జరిగింది. 
 
కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఎయిర్‌పోర్టులో భారత ఆటగాళ్లను అధికారులు అడ్డుకున్నారు. 18 ఏళ్లు నిండని వారికి భారత్‌లో వ్యాక్సినేషన్ ఇంకా ప్రారంభించలేదని వివరణ ఇచ్చినా అధికారులు వినిపించుకోలేదని టీమిండియా మేనేజర్ లోబ్జాన్ జీ టెన్జింగ్ తెలిపాడు. 
 
ఈ కారణంగా ఒకరోజు మొత్తం ఏడుగురు టీమిండియా ఆటగాళ్లను ఎయిర్‌పోర్టులోనే ఉంచారని.. తర్వాతి ఫ్లైట్‌కే భారత్‌కు తిరిగి వెళ్లిపోవాలని అక్కడి అధికారులు ఆదేశించారని టీమిండియా మేనేజర్ ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
ఎయిర్‌పోర్టు అధికారులు అడ్డుకున్న వారిలో టీమిండియా విశ్వవిజేతగా నిలిచేందుకు కీలకపాత్ర పోషించిన రవికుమార్, రఘువంశీ వంటి ఆటగాళ్లు ఉన్నారని తెలిపాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాహుల్ దయాగుణం .. ఎముక మజ్జ మార్పిడి చికిత్స కోసం విరాళం