Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ధోనీ షాకింగ్ నిర్ణయం... 200వ వన్డేకు మిస్, కెప్టెన్సీకి గుడ్ బై, కోహ్లికి పగ్గాలు...

జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. టీమిండియా వన్డే కెప్టెన్సీకి గుడ్‌పై చెప్పేశాడు. ఈ నిర్ణయాన్ని బీసీసీఐకు తెలపడంతో బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో విషయాన్ని పోస్ట్ చేసింది. దీనితో క్రికెట్ క్రీడాభిమానులు షాక్ తిన్నారు. కొ

Advertiesment
Team India Captain
, బుధవారం, 4 జనవరి 2017 (22:12 IST)
జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. టీమిండియా వన్డే కెప్టెన్సీకి గుడ్‌పై చెప్పేశాడు. ఈ నిర్ణయాన్ని బీసీసీఐకు తెలపడంతో బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో విషయాన్ని పోస్ట్ చేసింది. దీనితో క్రికెట్ క్రీడాభిమానులు షాక్ తిన్నారు. కొత్త సంవత్సరంలో ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. కాగా ధోనీ 199 వన్డేలకు సారధ్య బాధ్యతలను వహించాడు. మరో 72 టి-ట్వంటీ మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 
 
ఐతే తను కెప్టెన్సీ బాధ్యత నుంచి తప్పుకుంటున్నాను కానీ జట్టు నుంచి కాదని స్పష్టం చేశాడు. ధోనీ నిర్ణయంతో విరాట్ కోహ్లి అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ గా వ్యవహరిస్తాడని బీసీసీఐ స్పష్టం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డెహ్రాడూన్‌లో వాలిన ప్రేమపక్షులు.. అనుష్క భుజంపై చేయి వేసిన కోహ్లీ.. ఫోటో వైరల్