Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరుస ఓటములతో డీలాపడిన ముంబై ఇండియన్స్‌కు శుభవార్త... ఏంటది?

Advertiesment
surya kumar yadav

ఠాగూర్

, గురువారం, 4 ఏప్రియల్ 2024 (16:17 IST)
ఐపీఎల్ 2024 ఫ్రాంచేజీలలో ముంబై ఇండియన్స్ జట్టు ఒకటి. ఈ సీజన్‌లో ఆ జట్టు వరుస ఓటములను చవిచూస్తుంది. అలాంటి జట్టుకు ఓ శుభవార్త. స్టార్ ఆటగాడు సూర్యకుమార్ ముంబై ఇండియన్స్ జట్టులో చేరనున్నాడు. గురువారం ఎన్.సి.ఏ రొటీన్ టెస్ట్ చేయనుంది. రిటర్న్ టు ప్లే సర్టిఫికేట్‌ కోసం ఈ టెస్ట్ తప్పనిసరి. ఆ తర్వాత ఎన్.సి.ఏ నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ వచ్చిన వెంటనే ఆయన ముంబై జట్టులో చేరుతారు. 
 
కాగా, ప్రస్తుతం రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్ పోటీల్లో ముంబై ఇండియన్స్ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. ఇలా వరుస ఓటములతో డీలాపడిన ఎంఐకి ఇప్పుడు ఓ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఆ జట్టు కీలక ఆటగాడు, వరల్డ్ నం.01 టీ20 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఉన్న సూర్య కుమార్.. అక్కడ అన్ని ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకున్నట్లు సమాచారం. 
 
ఒక రొటీన్ టెస్టు మాత్రమే మిగిలివుందట. అది గురువారం జరుగుతుంది. ఆ తర్వాత ఎన్సీఏ నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ రావడమే ఆలస్యం సూర్యకుమార్ ముంబై జట్టుతో చేరుతాడు. ఎంఐ తన తర్వాతి మ్యాచ్‌లను 7వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్, 11వ తేదీన ఆర్సీబీతో ఆడనుంది. డీసీతో మ్యాచులో అతడు బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం.
 
ఇక సూర్య చేరిక ముంబైకి కలిసి రానుంది. వరుస ఓటములతో సతమతమవుతున్న ఎంఐకి సూర్యభాయ్ బూస్ట్ అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా, సూర్యకుమార్ గతే యేడాది డిసెంబరు నెలలో దక్షిణాఫ్రికాపై చివరి సారిగా క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత చీలమండ గాయంతో ఆటకు దూరమయ్యాడు. అప్పటి నుంచి ఎన్సీఏలోనే ఉండి గాయం నుంచి కోలుకుంటున్నాడు.
 
"సూర్య అన్ని టెస్టులు పూర్తి చేసుకున్నాడు. ఒక రోటిన్ టెస్ట్ మిగిలింది. అయితే, ఎన్సీఏ నుంచి ఆర్టీపీ (రిటర్న్ టు ప్లే) సర్టిఫికేట్కు ఈ టెస్టు తప్పనిసరి. ఇది గురువారం నిర్వహించడం జరుగుతుంది. దీని తర్వాత అతని పూర్తి ఫిటెనెస్పై ఒక అంచనా వస్తుంది. ఇప్పటికైతే అతడు సౌకర్యవంతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు" అని పీటీఐ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మయాంక్ యాదవ్‌వా మజాకా.. 155.8 kmph వేగంతో దూసుకెళ్లింది..