ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 టోర్నీలో భాగంగా, ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు చేతిలో 72 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగులు చేసింది. ఆ తర్వాత 204 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసి చిత్తుగా ఓడిపోయింది. అదికూడా సొంతగడ్డపై ఓడిపోవడం హైదరాబాద్ జట్టు అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ మ్యాచ్‌లో ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టుకు ఏ ఒక్క అంశం కలిసిరాలేదు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటే ఆ నిర్ణయం కూడా బెడిసికొట్టింది. ఆర్ఆర్ బ్యాటర్లు ఉతికి ఆరేశారు. ఫలితంగా ఫలితంగా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్లు జైస్వాల్ 54, బట్లర్ 54, కెప్టెన్ సంజూ శాంసన్ 55, హెట్మెయర్ 22 (నాటౌట్) చొప్పున పరుగులు చేసి రాణించారు. దేవదత్ పడిక్కల్ (2), రియాన్ పరాగ్ (7) విఫలమయ్యారు. ఒక దశలో ఆర్ఆర్ ఆటగాళ్ల బ్యాటింగ్ చూస్తే 250కి పైగా స్కోరు సాధిస్తుందని భావించారు. కానీ, చివర్లో హైదరాబాద్ బౌలర్లు విజృంభించడంతో 203 పరుగులకే కట్టడి చేశారు.
ఆ తర్వాత 204 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదారాబాద్ జట్టు ఓ దశలో 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్ అభిషేక్ శర్మ, వన్‌డౌన్ ఆటగాడు రాహుల్ త్రిపాఠి కూడా ఇదేవిధంగా వెనక్కి వెళ్లాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 27 పరుగులు చేయగా, ఖరీదైన ఆటగాడు హ్యారీ బ్రూక్ 13 పరుగుల నిరాశపరిచాడు.
వాషింగ్టన్ సుందర్ (1), గ్లెన్ ఫిలిప్స్ (8), ఆదిల్ రషీద్ (18), ఉమ్రాన్ మాలిక్ (19 నాటౌట్) ధాటిగా ఆడాడు. ఉమ్రాన్ మాలిక్ (8) బంతులు ఎదుర్కొని 1 ఫోర్, 2 సిక్స్‌లు కొట్టాడు. ఆర్ఆర్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ 4 వికెట్లు తీయడం విశేషం. ట్రెంట్ బౌల్ట్ 2, జాసన్ హోల్డర్ 1, రవిచంద్రన్ అశ్విన్ 1 వికెట్ తీశారు.