Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉప్పల్ స్టేడియంలో పరుగుల మోత మోగించిన సన్ రైజర్స్ బ్యాటర్లు..

srh ipl team

వరుణ్

, గురువారం, 28 మార్చి 2024 (11:06 IST)
ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు పరుగుల వరద పారించారు. బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టుపై హైదరాబాద్ ఆటగాళ్లు చెలరేగి ఆడారు. ఫలితంగా ఆ జట్టు రికార్డు స్థాయి విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 277 పరుగులు చేసింది. ఇదే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగుల రికార్డు కావడం గమనార్హం. అయితే, టీ20 ఫార్మెట్‌లో కూడా ఇది అత్యధిక స్కోరు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ, గత గణాంకాలను పరిశీలిస్తే 277 పరుగులు అత్యధిక స్కోరు కాదని స్పష్టమవుతుంది. 
 
గత 2023లో మంగోలియాపై నేపాల్ జట్టు ఏకంగా 314 పరుగులు బాదింది. కేవలం 3 వికెట్లు నష్టపోయి పెనువిధ్వంసం సృష్టించింది. ఇక 2019లో ఐర్లాండ్‌పై ఆఫ్ఘనిస్తాన్ 278/3 స్కోరు నమోదు చేసింది. అదే యేడాది తుర్కియేపై చెక్ రిపబ్లిక్ కూడా 278/4 స్కోరు చేసింది. ఇక తాజా సంచలన స్కోరు 277/3 నాలుగో స్థానంలో నిలిచింది. ఇక 2023లో ఆంధ్రా జట్టుపై పంజాబ్ 275/6 స్కోరు నమోదు చేసి 5వ స్థానంలో నిలిచింది.
 
ఇదిలావుంటే, ముంబై ఇండియన్స్ బౌలర్లపై సన్ రైజర్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. కేవలం 3 వికెట్లు నష్టపోయి 277 పరుగులు బాదారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేయడంలో ట్రావిస్ హెడ్ (24 బంతుల్లో 62), అభిషేక్ శర్మ (23 బంతుల్లో 63), హెన్రిచ్ క్లాసెన్ (34 బంతుల్లో 80 నాటౌట్), ఐడెన్ మార్క్రమ్ (42 నాటౌట్) కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కాగా ఈ మ్యాచ్ ముంబైపై సన్రైజర్స్ జట్టు 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 
 
IPL 2024: ఉప్పల్ స్టేడియం ఊగిపోయింది.. రికార్డుల మోత మోగింది... 
 
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 పోటీల్లో భాగంగా, బుధవారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో ముంబై జట్టు వరుసగా తన రెండో ఓటమిని చవిచూసింది. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు చెలరేగిపోయింది. సొంత గడ్డతో పాటు సొంత ప్రేక్షకుల మధ్య హైదరాబాద్ బ్యాటర్లు వీరవిహారం చేశారు. ఫలితంగా ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 277 పరుగుల భారీ స్కోరు చేశారు. ఆ తర్వాత భారీ లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన ముంబై జట్టు కూడా ఆరంభం నుంచి అదే ఊపును కనబరిచింది. చివరకు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. అయితే, కీలక సమయంలో ప్రధాన వికెట్లను కోల్పోవడంతో పాటు భారీ రన్‌రేట్ కారణంగా మ్యాచ్ ఆఖరులో ఆ జట్టు విజయానికి మరో 32 పరుగుల దూరంలో వచ్చి ఆగిపోయింది. కాగా, ఈ మ్యాచ్‌లో నమోదైన రికార్డు వివరాలను పరిశీలిస్తే, 
 
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన జట్టు హైదరాబాద్ - 277
సెకండ్ ఇన్నింగ్స్‌‍ల్లోనూ అత్యధిక స్కోర్ నమోదు.. ముంబై 246
ఒక మ్యాచ్‌లో రెండు జట్ల మొత్తం స్కోర్ - 523
2023లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మొత్తం స్కోర్ 517 పరుగులు
పురుషుల టీ20, ఐపీఎల్ టోర్నీలో ఇదే (529) అత్యధిక స్కోర్
ఐపీఎల్లో 2010లో చెన్నై, రాజస్థాన్ జట్లు కలిసి 469 పరుగులు చేశాయి.
ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధికంగా నమోదైన సిక్సులు - 38
పురుషుల టీ20 టోర్నీలో అత్యధిక నమోదైన సిక్స్‌లు నమోదైన మ్యాచ్ ఇదే - 38
ఈ మ్యాచ్‌లో మొత్తం నమోదైన సిక్స్‌లు, ఫోర్లు 69. 2010లో చెన్నై, రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 69 బౌండరీలు ఉన్నాయి.
ఈ మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు కొట్టిన సిక్స్‌ల సంఖ్య 20. అంతకుముందు 2013లో బెంగళూరు బ్యాటర్లు 21 సిక్స్‌లు కొట్టారు.
తొలి 10 ఓవర్లలో సన్ రైజర్స్ స్కోరు 148. గత రికార్డు (2014లో పంజాబ్, 2021లో ముంబై 131 పరుగులు) కనుమరుగైంది.
అర్థశతకం సాధించేందుకు అభిషేక్ శర్మ ఆడిన బంతులు 16. సన్ రైజర్స్ తరపున ఐపీఎల్లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బ్యాటర్ అతనే.
ఓ ఐపీఎల్ మ్యాచ్లో ఒకే జట్టు నుంచి 20 బంతుల్లోపే అర్థశతకాలు పూర్తి చేసుకున్న తొలి ద్వయంగా హెడ్ - అభిషేక్ నిలిచారు.
ముంబై పేసర్ మపాక సమర్పించుకున్న పరుగులు 66. ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్నది అతనే.
ముంబై తరపున ఐపీఎల్లో రోహిత్ ఆడిన మ్యాచ్‌ల సంఖ్య 200. ఆ జట్టు తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడింది అతనే. ఈ సందర్భంగా మ్యాచ్‌కు ముందు రోహిత్క సచిన్ 200 నంబరుతో కూడిన ప్రత్యేక జెర్సీ, టోపీ బహుకరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

IPL 2024: ఉప్పల్ స్టేడియం ఊగిపోయింది.. రికార్డుల మోత మోగింది...