ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో క్యాచ్ పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు ప్లీహము, పక్కటెముక గాయంతో ఆస్పత్రిలో అడ్మిట్ అయిన భారత వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సిడ్నీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యర్. శస్త్రచికిత్స అనంతరం శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్యం స్థిరంగా వుందని.. దీంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి
కాగా మూడో వన్డేలో హర్షిత్ రాణా బౌలింగ్‌లో అలెక్స్ కారీని అవుట్ చేయడానికి కష్టమైన క్యాచ్‌ను ప్రయత్నించినప్పుడు 30 ఏళ్ల అతను ఎడమ పక్కటెముకకు గాయం అయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న శ్రేయాస్ అయ్యర్ పూర్తి ఫిట్ నెస్ తర్వాత భారతదేశానికి తిరిగి వస్తాడని భావిస్తున్నారు కానీ కనీసం రెండు నెలల పాటు ఆటకు దూరంగా ఉంటాడని తెలుస్తోంది.
సిడ్నీలోనే అయ్యర్ వుంటాడని విమాన ప్రయాణానికి ఆయన ఆరోగ్యం సహకరిస్తుందా అనేది వైద్యులు నిర్ధారించిన తర్వాతే భారత్ వస్తాడని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.