Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంపాక్ట్ రూల్ ధోనీకి వర్తించదు.. కెప్టెన్సీ లేకుంటే ఆడడు- సెహ్వాగ్

dhoni - csk
, సోమవారం, 29 మే 2023 (18:27 IST)
టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భవిష్యత్తులో ధోనీని కోచ్‌ లేదా డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ పదవిలో చూసే అవకాశం లేకపోలేదని సెహ్వాగ్ అన్నాడు. 
 
ఐపీఎల్‌లో కొత్తగా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో బౌలర్, బ్యాటర్‌ను తీసుకునే వెసులుబాటు జట్లకు వుంటుంది. ఈ రూల్‌తో ధోనీ మరికొన్ని సంవత్సరాలు ఐపీఎల్ ఆడతాడని భావిస్తున్న తరుణంలో సెహ్వాగ్ ధోనీ ఫ్యూచర్‌పై కామెంట్లు చేశాడు.

ధోనీకి ఇలాంటి ఇంపాక్ట్ రూల్ వర్తించదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫిట్‌గా ఉంటే.. 40 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడటం పెద్ద కష్టమేం కాదు. 
 
ఈ సీజన్‌లో ధోనీ పెద్దగా ఆడటం లేదు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఆడిన బంతులను లెక్కపడితే.. 40 నుంచి 50 దాకా ఉంటాయంతేనని సెహ్వాగ్ అంటున్నాడు. తన మోకాలి గాయం తీవ్రం కాకుండా ధోనీ చూసుకుంటున్నాడని, ప్రస్తుతం కెప్టెన్సీ కోసమే ధోనీ ఆడుతున్నాడు. 
 
మైదానంలో ప్రత్యర్థులను వ్యూహాలతో కట్టడి చేస్తున్నాడని, కెప్టెన్‌గా అతడు గ్రౌండ్‌లో వుండాలి కాబట్టి వుంటున్నాడు. అతని ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అవసరం లేదని వివరించాడు. ఇంప్టాక్‌ రూల్‌ అనేది పూర్తిస్థాయిలో మైదానంలో లేకుండా బ్యాటింగ్‌ లేదా బౌలింగ్‌ చేయడానికే వినియోగించుకుంటారని గుర్తు చేశాడు. 
 
కానీ ధోనీ మాత్రం 20 ఓవర్లపాటు మైదానంలో ఫీల్డింగ్‌ చేస్తాడు. అతడు కెప్టెన్‌ కాకపోతే.. ఇంపాక్ట్ ప్లేయర్‌గా కూడా ఆడడు. అందుకే ధోనీ భవితవ్యం త్వరలో కోచ్ లేదా డైరక్టర్ ఆఫ్ క్రికెట్ పదవితో ముడిపడి వుండవచ్చునని సెహ్వాగ్ చెప్పాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలీస్ ఆఫీసర్‌ను చితకబాదిన సీఎస్కే మహిళా అభిమాని.. కారణం? (video)