Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చాంపియన్స్ ట్రోఫీలో పరాజయంపై జట్టుపై విరుచుకుపడ్డ కుంబ్లే... దాని ఫలితమే రాజీనామా

టీమిండియా కోచ్ పదవికి అనిల్ కుంబ్లే ఉన్నట్లుండి మంగళవారం రాజీనామా ప్రకటించడానికి నేపధ్యం బయటపడింది. చాంపియన్స్ ట్రోపీలో భారత్ ఘోరపరాజయంపై ఎవరెవరి బాధ్యత ఎంత అనే అంశంపై కుంబ్లే టీమ్‌లోని కొంతమంది సభ్యులను వ్యక్తిగతంగా పిలిచి తీవ్రంగా మందలించాడట. కుంబ్

చాంపియన్స్  ట్రోఫీలో పరాజయంపై జట్టుపై విరుచుకుపడ్డ కుంబ్లే... దాని ఫలితమే రాజీనామా
హైదరాాబాద్ , బుధవారం, 21 జూన్ 2017 (07:13 IST)
టీమిండియా కోచ్ పదవికి అనిల్ కుంబ్లే ఉన్నట్లుండి మంగళవారం రాజీనామా ప్రకటించడానికి నేపధ్యం బయటపడింది. చాంపియన్స్ ట్రోపీలో భారత్ ఘోరపరాజయంపై ఎవరెవరి బాధ్యత ఎంత అనే అంశంపై కుంబ్లే టీమ్‌లోని కొంతమంది సభ్యులను వ్యక్తిగతంగా పిలిచి తీవ్రంగా మందలించాడట. కుంబ్లే మందలింపులను తట్టుకోలేకపోయిన ఆ ప్లేయర్లు వెంటనే కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇదే అంతిమంగా కుంబ్లే తన కోచ్ పదవికి నమస్కారం పెట్టి తప్పుకున్నాడని తెలుస్తోంది. 
 
వాస్తవానికి తప్పకుండా గెలుస్తుందని భావించిన టీమిండియా చాంఫియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు చేతిలో ఘోరంగా దెబ్బతిని 180 పరుగుల తేడాతో ఓడిపోవడంపై కోట్లమంది అభిమానులు తిట్టిపోశారు. కెప్టెన్ కోహ్లీ దిష్టిబొమ్మలు తగులుబెట్టారు. ఈ నేపధ్యంలోనే కుంబ్లే కూడా ఫైనల్ ఆడిన జట్టులోని కొందరు సభ్యులను ఇంత పేలవంగా ఆడతారా అంటూ దుయ్యబట్టినట్లు సమాచారం. దీంతో ముందుగానే టీమ్‌కు, కోచ్‌కు మధ్య దెబ్బతిన్న సంబందాలు పూర్తిగా బెడిసికొట్టాయని ఇక లాభం లేదని కుంబ్లేనే స్వయంగా రాజీనామాకు సిద్ధపడిపోయినట్లు తెలుస్తోంది.  
 
వాస్తవానికి భారత లెజెండరీ బౌలర్లతో పోలిస్తే టీమిండియా బౌలర్లు చాంపియన్స్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన చేశారని కుంబ్లే తీవ్ర విమర్శలు చేశాడట.  దీంతో వారు భయాందోళనలకు గురైనారని తెలుస్తోంది. సోమవారం రాత్రి బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి, సీఈఓ రాహుల్ జోహ్రి, జనరల్ మేనేజర్ ఎంవీ శ్రీధర్‌తో కుంబ్లే, కోహ్లీ భేటీ అయినప్పుడు కుంబ్లేపై కోహ్లీ తీవ్రంగా దాడిచేశాడని వినికిడి. దాంతోనే కుంబ్లే వెస్టిండీస్ పర్యటనకు వెళుతున్న టీమిండియాతో పాటు విమానంలో ప్రయాణిచడం లేదని వార్త వెల్లడయింది. 
 
మంగళవారం టీమిండియా జట్టు వెస్టిండీస్ పర్యటనకు బయలు దేరిన కొద్ది గంటల్లోపే అనిల్ కుంబ్లే తన కోచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పాడు. టీమ్ కెప్టెన్‌కి, తనకు మధ్య ఏర్పడిన అపార్థాలను తొలగించాలని బీసీసీఐ ప్రయత్నించింది కానీ తమ ఇద్దరి మధ్య భాగస్వామ్యం ఇక సాధ్యం కాదని అర్థమవడంతో తప్పుకోవడమే మంచిందని భావిస్తున్నట్లు కుంబ్లే ట్వీట్ చేశాడు. మంగళవారం సాయంత్రం బీసీసీఐ కూడా ప్రధాన కోచ్‌గా కుంబ్లే తన సేవలను ఉపసంహరించుకున్నట్లు ట్వీట్ చేసింది. క్రికెట్ సలహా కమిటీ అతడి పదవీకాలాన్ని పొడిగించాలని నిర్ణయించినప్పటికీ కోచ్‌గా ఇక కొనసాగకూడదని కుంబ్లే నిర్ణయించుకున్నాడు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కృతజ్ఞత లేనివారి తిరుగుబాటు.. ఆత్మగౌరవంతో తప్పుకున్న కోచ్.. బోర్డే పొగపెట్టిందా?