Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోహ్లీ, రోహిత్‌శర్మల మధ్య విభేదాలు.. ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి అన్‌ఫాలో...

Advertiesment
Rohit Sharma
, శనివారం, 27 జులై 2019 (16:23 IST)
టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మల విభేదాలు తలెత్తాయనే వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ చేతిలో సెమీస్‌ ఓటమి తర్వాత కెప్టెన్, వైస్ కెప్టెన్‌ల మధ్య వివాదం మొదలైందని వార్తలు వచ్చాయి. విండీస్ పర్యటనకు వెళ్లకుండా విశ్రాంతి తీసుకోవాలని కోహ్లి భావించాడని.. కానీ రోహిత్‌కి కెప్టెన్సీని అప్పగించడం ఇష్టం లేకే మళ్లీ మనసు మార్చుకున్నాడని జోరుగా ప్రచారం జరిగింది. 
 
ఈ వార్తలను బీసీసీఐ ఖండించింది. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే.. కోహ్లి, రోహిత్ మధ్య విబేధాలున్నాయనే అంశంపై నెటిజన్లు ఫుల్ స్టాప్ పెట్టలేదు. ఇందుకు కారణం లేకపోలేదు. ఓపెనర్‌ రోహిత్‌శర్మ.. కోహ్లీ, ఆయన భార్య అనుష్కశర్మలను ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి అన్‌ఫాలో అయ్యారని సమాచారం. దీంతో కోహ్లీతో విబేధాలు నిజమేనని తెలుస్తోంది.
 
అయితే జట్టు కూర్పు, వ్యూహాల విషయంలో ఎవరి అభిప్రాయాన్ని వాళ్లు వినిపిస్తారు. ఈ విషయమై వాదనలు, చర్చలు నడుస్తాయి. కానీ ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తారు, సమష్టిగా నిర్ణయం తీసుకుంటాం. కోహ్లి, రోహిత్ సంబంధాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరమేం లేదని భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఇప్పటికే వ్యాఖ్యలు చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షమీపై భార్య కేసు.. వీసా ఇచ్చేందుకు అమెరికా నో.. చివరికి?