Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విరాట్ కోహ్లీ రనౌట్ అయితే రోహిత్ సెంచరీ ఖాయం...

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మల జోడీకి మధ్య సమన్వయ లోపం ఉందనే విషయం మరోమారు నిరూపితమైంది. ఇలా సమన్వయ లోపం ఏర్పడిన సమయంలో తొలుత విరాట్ కోహ్లీ రనౌట్ అయితే మాత్రం

Advertiesment
Rohit Sharma
, బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (19:54 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మల జోడీకి మధ్య సమన్వయ లోపం ఉందనే విషయం మరోమారు నిరూపితమైంది. ఇలా సమన్వయ లోపం ఏర్పడిన సమయంలో తొలుత విరాట్ కోహ్లీ రనౌట్ అయితే మాత్రం ఆ మ్యాచ్‌‌లో రోహిత్ శర్మ ఖచ్చితంగా సెంచరీ కొట్టడం ఖాయమని తేలిపోయింది. ఈ విషయం తాజాగా కూడా నిరూపితమైంది. పోర్ట్ ఎలిజబెత్ వేదికగా దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన ఐదో వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీ బాది జట్టును గెలిపించడమే కాకుండా, వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలివుండగానే కైవసం చేసుకోవడం జరిగింది. 
 
కాగా, గతంలో వీరిద్దరూ సమన్వయ లోపం కారణంగా ఏడుసార్లు ఎవరో ఒకర రనౌట్ అయ్యారు. ఈ ఏడు ర‌నౌట్ల‌లో కోహ్లీ ఐదుసార్లు వెనుదిర‌గ‌గా.. రోహిత్ రెండుసార్లు పెవిలియ‌న్ చేరాడు. ఇందులో విశేషం ఏమిటంటే కోహ్లీ రనౌట్ అయిన ఈ ఐదుసార్లూ రోహిత్ సెంచ‌రీలు న‌మోదు చేయగా, ఇందులో రెండు డ‌బుల్ సెంచరీలు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. 
 
ఇకపోతే, ఈ మ్యాచ్‌కు తన ఫామ్‌పై విమర్శలు చేసినవారికి రోహిత్ శర్మ ఘాటుగానే సమాధానమిచ్చాడు. ముఖ్యంగా గత నాలుగు మ్యాచ్‌ల్లో తన ప్రదర్శనపై మీడియా అడిగిన ప్రశ్నలకు రోహిత్ కాస్త కోపంగానే బదులిచ్చాడు. 'అవును, గత నాలుగు మ్యాచ్‌ల్లో నేను గొప్పగా ఆడలేదని అంగీకరిస్తున్నా.. అంతమాత్రానికి నేను ఫామ్ కోల్పోయినట్లు మీరేలా నిర్ధారిస్తారు. 
 
గత నాలుగు మ్యాచ్‌ల్లో నేను వికెట్‌ కోల్పోయిన విధానం వేరే. ప్రతి క్రికెటర్ ఏదో ఒక సమయంలో ఇలాంటి సమస్య ఎదుర్కొంటాడు. ఇలాంటి సవాళ్లు ఎదురైతేనే.. మేం ఇంకా ఎక్కువ కష్టపడతాం. అంతేకాని ఆ విషయం గురించి ఆలోచిస్తూ నేను ఏనాడు కుమిలిపోలేదు. ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచించాను. తర్వాతి ఆటల్లో అదే తప్పు జరుగకుండా జాగ్రత్తపడ్డా' అంటూ వివరించాడు. 
 
అలాగే, ఇక తను సెంచరీ చేసిన వెంటనే ఎందుకు సెలెబ్రేట్ చేసుకోలేదో కూడా వివరించాడు. 'నేను శతకం చేసిన ఆనందం కంటే.. నా ముందు ఇద్దరు ఔట్ అయ్యారు. నాకు అదే బాధ ఉంది. ఆ పరిస్థితిలో ఎలా సెలెబ్రేట్ చేసుకుంటా.. అయినా ఇప్పుడు శతకం గురించి కాదు... వచ్చే మ్యాచ్‌ల్లో ఎక్కువ పరుగులు చేసి జట్టు స్కోర్ పెంచాలి అనే ఆలోచిస్తున్నా. ఈ సిరీస్‌‌ని 5-1 తేడాతో దక్కించుకొనేందుకు మేం ప్రయత్నిస్తాం' అంటూ సఫారీలకు హెచ్చరికలు పంపాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సఫారీలకు కాళరాత్రి... సౌతాఫ్రికా గడ్డపై కోహ్లీ సేన సరికొత్త చరిత్ర