Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐసీసీ ప్రపంచ కప్ : భారీ లక్ష్యాన్ని ఛేదించి శ్రీలంకను చిత్తు చేసిన పాకిస్థాన్

Advertiesment
sri lanka - pakistan
, బుధవారం, 11 అక్టోబరు 2023 (08:54 IST)
భారత్‌లో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, మంగళవారం పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య కీలక పోరు జరిగింది. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 345 పరుగుల భారీ స్కోరు చేయగా, ఈ లక్ష్యాన్ని పాకిస్థాన్ జట్టు ఛేదించి ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా ప్రపంచంలో అత్యధిక పరుగులను ఛేదించిన తొలి జట్టుగా పాకిస్థాన్ నిలిచింది. ఇప్పటివరకు ఇంగ్లండ్ పేరిట ఉన్న ఈ రికార్డును పాక్ కుర్రోళ్లు చెరిపేశారు. 
 
హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ 77 బంతుల్లో 122 పరుగులు  చేయగా, సమరవిక్రమ 89బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 108 పరుగులు చేశారు. వీరిద్దరి బ్యాటింగ్ దెబ్బకు పాకిస్థాన్ బౌలింగ్ డీలాపడిపోయింది. మిగిలిన లంక ఆటగాళ్లలో పత్తుమ్ నిస్సాంక 51, ధనంజయ డిసిల్వా 25 చొప్పున పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో హాసన్ అలీకి 4, హరీస్ రవూఫ్ 2, షహీన్ అఫ్రిది, మహ్మద్ సిరాజ్, షాదాద్ ఖాన్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 
 
ఆ తర్వాత 345 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు మరో 10 బంతులు మిగిలివుండగానే లక్ష్యాన్ని చేరుకుని విజయఢంకా మోగించింది. పాక్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌లు సూపర్ సెంచరీలతో రాణించారు. షపీక్ 103 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 113 పరుగులు చేయగా, రిజ్వాన్ 121 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 131 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 
 
ఓ దశలో పాకిస్థాన్ జట్టు 37 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినా.. షఫీక్, రిజ్వాన్‌ల జోడీ మూడో వికెట్‌కు ఏకంగా 180 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయానికి బాటలు వేశారు. షఫీక్ ఔటైన్ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన షాద్ షకీల్ 31, ఆ తర్వాత మ్యాచ్ ఆఖరులో వచ్చిన ఇఫ్తికార్ అహ్మద్‌ సుడిగాలి ఇన్నింగ్ ఆడి 10 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 22 పరుగులు చేసి జట్టు గెలుపును మరింత సులభతరం చేశాడు. ఫలితంగా పాకిస్థాన్ ఆరు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తడాఖా చూపెట్టిన లంకేయులు.. అదరగొట్టిన దాయాదులు.. గెలుపు ఎవరిది?