Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

350 వికెట్లతో అనిల్ కుంబ్లే రికార్డును బ్రేక్ చేసిన రవిచంద్రన్ అశ్విన్

Advertiesment
ashwin

వరుణ్

, ఆదివారం, 25 ఫిబ్రవరి 2024 (14:27 IST)
భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆదివారం 350 టెస్టు వికెట్లు సాధించాడు. తద్వారా అనిల్ కుంబ్లే రికార్డును బ్రేక్ చేశాడు. అశ్విన్ ఈ ఫీట్ సాధించడానికి బెన్ డకెట్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాతి బంతికి ఆలీ పోప్‌ను వెనక్కి పంపడం ద్వారా భారతదేశంలో అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన ఆటగాడిగా అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాడు.
 
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ బంతితో అటాక్ ప్రారంభించాడు. ఈ క్రమంలో ఐదవ ఓవర్‌లో తన కెప్టెన్‌కి డకెట్ వికెట్‌ను బహుమతిగా ఇచ్చాడు. రాంచీ టెస్టులో 3వ రోజు రెండో సెషన్‌లో అశ్విన్ 2 వికెట్లకు 19 పరుగులే ఇచ్చాడు. పోప్ తర్వాతి డెలివరీలో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అశ్విన్ ప్రస్తుతం భారత్‌లో 351 టెస్టు వికెట్లు సాధించాడు. 300పైగా వికెట్లు తీసిన బౌలర్లు ఇద్దరే కావడం విశేషం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యశస్వి జైస్వాల్ అదుర్స్.. 12 సిక్సర్లతో వీరేంద్ర సెహ్వాగ్ రికార్డ్ బ్రేక్