Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజ్‌కోట్ టెస్ట్ మ్యాచ్ : సెంచరీ చేసిన రోహిత్ శర్మ... అర్థ సెంచరీతో జడేజా...

Rohit Sharma

ఠాగూర్

, గురువారం, 15 ఫిబ్రవరి 2024 (15:23 IST)
రాజ్‌కోట్ వేదికగా పర్యాటక ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో రాణించాడు. మూడో టెస్టులో తొలుత టాస్ గెలిచిన రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో జైశ్వాల్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ... ముచ్చటైన ఆటతీరుతో సెంచరీ పూర్తి చేశాడు. రోహిత్ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 157 బంతుల్లో సెంచరీ కొట్టాడు. తన టెస్ట్ కెరీర్‌లో 11వ సెంచరీ సాధించాడు. రోహిత్ శర్మకు ఇది 11వ సెంచరీ కావడం గమనార్హం. అంతేకాదు టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండో బ్యాట్స్‌మెన్‌గా ఘనత సాధించాడు. 
 
మరోవైపు, రోహిత్ శర్మకు అండగా మరో ఎండ్‌లో జడేజా కూడా నిలకడైన ఆటతీరుతో రాణించి అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం రోహిత శర్మ 129, జడేజా 83 పరుగులతో మైదానంలో ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఏకంగా 201 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం భారత్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. మిగిలిన ఆటగాళ్లలో జైశ్వాల్ 10, శుభమన్ గిల్ డకౌట్ కాగా, రాజాత్ పటీదార్ 5 చొప్పున పరుగులు చేశఆరు. ఇంగ్లండ్ బౌలర్లలో ఉడ్ రెండు వికెట్లు పడగొట్టగా, హార్ట్లీ ఒక వికెట్ తీశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెన్నై సూపర్ కింగ్స్‌ బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్