2 ఒలింపిక్ పతకాలకే సంబరాలా...? మేమంతే, మీరు వరల్డ్ కప్ గెలవకపోయినా....
ఒలింపిక్ క్రీడల్లో ఏదో రెండు పతకాలు గెలిచిన ఇండియా విచ్చలవిడిగా సంబరాలు చేసుకుంటోందనీ, 120 కోట్ల మంది జనాభా కలిగిన ఆ దేశం ఇలాంటి సంబరాలను చేసుకుంటుంటే ఆశ్చర్యంగా ఉందంటూ బ్రిటిష్ జర్నలిస్టు పియర్స్ మోర్గాన్ తీవ్రమైన రాతలను ట్విట్టర్లో పోస్టు చేశాడు. బ
ఒలింపిక్ క్రీడల్లో ఏదో రెండు పతకాలు గెలిచిన ఇండియా విచ్చలవిడిగా సంబరాలు చేసుకుంటోందనీ, 120 కోట్ల మంది జనాభా కలిగిన ఆ దేశం ఇలాంటి సంబరాలను చేసుకుంటుంటే ఆశ్చర్యంగా ఉందంటూ బ్రిటిష్ జర్నలిస్టు పియర్స్ మోర్గాన్ తీవ్రమైన రాతలను ట్విట్టర్లో పోస్టు చేశాడు. బ్యాడ్మింటన్‌లో రజత పతకం సాధించిన సింధు, రెజ్లింగ్‌లో కాంస్యం సాధించిన సాక్షి మాలిక్‌లకు భారతదేశంలో పెద్దఎత్తున నీరాజనాలు పలకటం ఆశ్చర్యంగా ఉందంటూ వ్యాఖ్యానించారు.
కాగా మోర్గాన్ వ్యాఖ్యలపై ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మండిపడ్డారు. తాము ప్రతి చిన్న విషయాన్ని ఆస్వాదిస్తామనీ, సంబరాలు చేసుకుంటామని ట్వీట్ చేశారు. అంతేకాదు... క్రికెట్ క్రీడను కనిపెట్టిన ఇంగ్లాండ్ ఇంకా ప్రపంచ కప్ కోసం ఆడుతూనే ఉండటాన్ని చూస్తుంటే తనకు చాలా ఆశ్చర్యంగా ఉందంటూ రివర్స్ ఎటాక్ చేశారు.