క్రికెట్ దిగ్గజాలను వెనక్కి నెట్టిన అశ్విన్... అరుదైన రికార్డు సొంతం
భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌లను వెనక్కినెట్టాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యుత్తుమ గణాంకాలు నమోదు చేయడం ద్వారా అరుదైన రికార్డును తన పేరిట లిఖి
భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌లను వెనక్కినెట్టాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యుత్తుమ గణాంకాలు నమోదు చేయడం ద్వారా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలో భారత దిగ్గిజ ఆటగాళ్లైన సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్‌లను కూడా వెనక్కి నెట్టేశాడు. అంతేగాక మొదటి ఇండియన్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అటు బాల్‌తో, ఇటు బ్యాట్‌తో రాణించిన అశ్విన్‌కు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' దక్కిన సంగతి తెలిసిందే. అయితే అది అశ్విన్‌కు తన టెస్ట్ కెరీర్‌లో 6వది. టెస్ట్ క్రికెట్‌లో ఇప్పటివరకు అశ్విన్ మొత్తం 6 సార్లు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డులను స్వీకరించాడు. అయితే ఈఫీట్ సాధించినందుకు అశ్విన్ ఆడిన టెస్ట్ మ్యాచ్‌లు కేవలం 36 మాత్రమే.
అంతకుముందు వరకు సచిన్, సెహ్వాగ్‌లు సంయుక్తంగా ఐదు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డులు పొంది సమానంగా మొదటి స్థానంలో ఉండేవారు. టెస్ట్ మ్యాచ్‌ల్లో భారత్ తరపున ఎక్కువ 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' అవార్డులు పొందిన వారిలో అశ్విన్ మొదటి ప్లేస్‌లో ఉండగా, సచిన్, సెహ్వాగ్‌లు రెండో స్థానంలో ఉన్నారు. అయితే సచిన్ ఈ ఘనతను 74 సిరీస్‌లలో అందుకోగా, సెహ్వాగ్ 39 సిరీస్‌లలో అందుకున్నాడు. అదే అశ్విన్ అయితే 13 సిరీస్‌లలోనే ఈ ఘనత సాధించి అరుదైన రికార్డును అందుకున్నాడు.