Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ధోనిలాగానే రనౌట్ చేసిన సిడ్డిల్.. వీడియో వైరల్ (video)

Advertiesment
ధోనిలాగానే రనౌట్ చేసిన సిడ్డిల్.. వీడియో వైరల్ (video)
, బుధవారం, 1 జనవరి 2020 (17:09 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనిలాగానే అచ్చం ఆస్ట్రేలియా మాజీ పేసర్ పీటర్ సిడ్డిల్ రనౌట్ చేసాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోని బిగ్ బాష్ లీగ్ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
 
ఈ మ్యాచ్‌లో సిడ్నీ థండర్‌ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ 168 పరుగులు చేయగా... అనంతరం లక్ష్య చేధనకు దిగిన అడిలైడ్‌ 165 పరుగులకే పరిమితమైంది.
 
కాగా ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పీటర్ సిడ్డిల్ బిగ్‌బాష్‌ లీగ్‌ (బీబీఎల్)లో అడిలైడ్‌ స్ట్రైకర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. మంగళవారం అడిలైడ్‌ స్ట్రైకర్స్-సిడ్నీ థండర్ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. 
 
ఈ మ్యాచ్‌లో పీటర్ సిడ్డిల్ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను ధోని తరహాలో రనౌట్ చేశాడు. సిడ్డిల్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో సిడ్నీ బ్యాట్స్‌మన్ ఉస్మాన్‌ ఖవాజా పరుగు కోసం ప్రయత్నించాడు. ఆ సమయంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తోన్న వెస్ అగర్‌ బంతిని అందుకొని వికెట్లకు కాస్త దూరంగా త్రో విసిరాడు. 
 
బంతిని అందుకున్న సిడ్డిల్... ధోనీ మాదిరి వికెట్లను చూడకుండా వెనుక నుంచి బెయిల్స్‌ను కిందపడేశాడు. ఆ సమయానికి ఉస్మాన్ ఖవాజా క్రీజులోకి రావకపోవడండో అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ దశాబ్దంలో అత్యుత్తమ వికెట్‌ కీపర్‌‌గా నిలిచిన ధోనీ..