Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జునైద్ ఖాన్ పుత్రిక మృతి: ట్విట్టర్‌లో వరస్ట్ డే అంటూ పాక్ ఫాస్ట్ బౌలర్ ట్వీట్!

జునైద్ ఖాన్ పుత్రిక మృతి: ట్విట్టర్‌లో వరస్ట్ డే అంటూ పాక్ ఫాస్ట్ బౌలర్ ట్వీట్!
, గురువారం, 28 ఏప్రియల్ 2016 (18:33 IST)
పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ జునైద్ ఖాన్‌ పుత్రిక చనిపోయింది. ప్రస్తుతం జునైద్ ఖాన్ సతీమణి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. జునైద్ ఖాన్ కుమార్తె పుట్టగానే మరణించింది. దీంతో జునైద్ ఇంట విషాదం నెలకొంది. ఈ విషయాన్ని జునైద్ ఖాన్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. తన జీవితంలోనే ఈ రోజు అత్యంత దురదృష్టకరమైందని పుట్టెడంత దుఃఖంతో వెల్లడించారు. తన భార్య కోలుకునేందుకు ప్రార్థించాలని అభిమానులను కోరుకున్నాడు. 
 
ఇలాంటి సమయంలో తనపట్ల దయ చూపించే ప్రతి ఒక్కరికీ జునైద్ ధన్యవాదాలు తెలిపాడు. అలాగే తన సతీమణి మెల్లమెల్లగా కోలుకుంటుందని చెప్పాడు. అయితే తన కుమార్తె పుట్టుకతో మరణించేందుకు గల కారణాలను జునైద్ వెల్లడించలేదు. 2016 పాకిస్థాన్ క్రికెట్ కప్‌లో బలూచిస్థాన్ తరపున ఆడిన జునైద్ ఖాన్ పుత్రికను కోల్పోవడంతో సహచరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దీపికా కుమారి వరల్డ్ రికార్డు ఆశలు గల్లంతు: 686 పాయింట్లతో బే రికార్డు సమం!