భారత టాప్ ఆర్చర్ దీపికా కుమారి ప్రపంచ రికార్డును తృటిలో కోల్పోయింది. ఆర్చరీ వరల్డ్ కప్ ఫస్ట్ స్టేజ్ మహిళల విభాగం 72 బాణాల ర్యాంకింగ్ రౌండ్లో దీపికా ఈ రికార్డుకు చేజార్చుకుంది. కొరియాకు చెందిన కి బోబే పేరిట ఉన్న 686 పాయింట్ల ప్రపంచ రికార్డును అదే పాయింట్లతో దీపికా కుమారి సమం చేసింది. చివరి ఆరు బాణాల్లో ఏకాగ్రత కోల్పోవడంతో ప్రపంచ రికార్డుపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరి ఆరు బాణాల్లో 59 పాయింట్లు కావాల్సి వుండగా దీపికా కుమారి తొలి మూడు బాణాల్లో రెండు తొమ్మిదులు సాధించడంతో సరిపెట్టుకుంది.
అలాగే ఒత్తిడి లోనుకావడంతో చివరి మూడు బాణాలను బుల్స్ ఐ తాకేలా గురిచూసి కొట్టింది. తద్వారా 2015లో కి బొ బే నెలకొల్పిన రికార్డు సమమైందే కానీ.. ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోయింది. అయినప్పటికీ దీపికా కుమారి మిక్స్‌డ్ విభాగంలో అద్భుత ప్రదర్శనతో భారత జట్టుపై ఆశలు పెంచింది. ఇకపోతే.. పురుషుల రికర్వ్ విభాగం అర్హత పోటీల్లో అటాను దాస్, మంగళ సింగ్, జయంత తాలూక్దార్ బృందం మూడో స్థానంలో ఉండగా, మహిళల జట్టు నాలుగో ర్యాంకులో ఉంది.