Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

న్యూజిలాండ్ 401 పరుగుల భారీ స్కోరు.. అయినా ఓడిపోయింది.. ఎందుకని?

Advertiesment
babar - kane
, శనివారం, 4 నవంబరు 2023 (22:54 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో శనివారం రెండు మ్యాచ్‌ కీలక మ్యాచ్‌లు జరిగాయి. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్‌ జట్లు తలపడగా, రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు పోటీపడ్డాయి. ఇందులో పాకిస్థాన్ జట్టును వరుణ దేవుడు గెలిపించారు. ఇంగ్లండ్ మరోమారు ఓటమిని చవిచూసింది.
 
సెమీస్‌కు వెళ్లాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు వరుణ దేవుడు సాయం చేశాడు. 402 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే షాక్ తగిలినా బెదిరిపోలేదు. అద్భుత ఫామ్‌లో ఉన్న ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్ 4 పరుగులకే అవుట్ కావడంతో ఆరు పరుగుల వద్ద పాకిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. 
 
అయితే మరో ఓపెనర్ ఫకార్ జమాన్ చెలరేగి ఆడాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో భారీ వర్షం కురవడానికి ముందే సిక్సర్ల వర్షం కురిపించాడు. 81 బాల్స్‌లో 8 ఫోర్లు, 11 సిక్సర్లతో 126 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కానీ వర్షం రెండు సార్లు అంతరాయం కలిగించింది. తొలిసారి వర్షం తగ్గిన తర్వాత పాకిస్థాన్ టార్గెట్‌ను 41 ఓవర్లలో 342 పరుగులుగా అంపైర్లు నిర్ణయించారు.
 
కాగా పాకిస్థాన్ 25.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 200 పరుగులు చేసి విజయం దిశగా దూసుకెళ్తున్న సమయంలో మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. అప్పటికి జమాన్ (126 నాటౌట్), బాబర్ ఆజమ్ (66 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఎంతసేపటికీ వర్షం తగ్గకపోవడంతో రాత్రి 7:40 గంటలను కటాఫ్ టైమ్‌గా అంపైర్లు ప్రకటించారు. అప్పటిలోగా మ్యాచ్ మరోసారి ప్రారంభం కాకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 21 పరుగుల తేడాతో పాకిస్థాన్ గెలిచినట్లు అంపైర్లు వెల్లడించారు. 
 
సెమీస్‌కు వెళ్లాలంటే అటు న్యూజిలాండ్, ఇటు పాకిస్థాన్ తమ చివరి మ్యాచ్‌లో గెలిచి తీరాలి. న్యూజిలాండ్ తమ ఆఖరి మ్యాచ్‌ను శ్రీలంకతో ఆడాల్సి ఉండగా.. పాకిస్థాన్ తమ చివరి మ్యాచ్‌ను ఇంగ్లండ్‌తో ఆడాల్సి ఉంది. అయితే పాకిస్థాన్ భారీ తేడాతో గెలవాలి. ఎందుకంటే నెట్ రన్‌రేట్ వాళ్లకు మైనస్‌లో ఉంది.
 
మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ఓడిపోయింది. ఆసీస్ నిర్దేశించిన 286 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ జట్టు 253 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 33 పరుగుల తేడాతో ఆసీస్ గెలుపొందింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇషాంత్ శ‌ర్మకు అమ్మాయి పుట్టిందోచ్..